అంగరంగ వైభవంగా కానుకమాత తిరునాళ్ల | - | Sakshi
Sakshi News home page

అంగరంగ వైభవంగా కానుకమాత తిరునాళ్ల

Feb 3 2026 7:37 AM | Updated on Feb 3 2026 7:37 AM

అంగరం

అంగరంగ వైభవంగా కానుకమాత తిరునాళ్ల

అంగరంగ వైభవంగా కానుకమాత తిరునాళ్ల ● మహోత్సవ దివ్యపూజాబలిలో పలు ప్రాంతాలకు చెందిన 60 మంది గురువులు, 42 మఠకన్యలు, వేలాది మంది భక్తులు పాల్గొన్నారు. సాయంత్రం 4 గంటల నుంచి వివిధ ప్రాంతాల నుంచి తరలి వచ్చిన వేలాదిమంది భక్తులు కరుణకల్గిన కానుకమాతకు కొవ్వొత్తులు సమర్పించి తమ మొక్కులను చెల్లించుకున్నారు. గురజాల డీఎస్పీ జగదీష్‌ పర్యవేక్షణలో ఎస్‌ఐ సీహెచ్‌ నాగార్జున పోలీసులతో బందోబస్తును ఏర్పాటు చేశారు.

రెంటచింతల: పునీతురాలైన కన్యమరియ తన కుమారుడైన ప్రభువైన ఏసుక్రీస్తును సమస్త మానవాళి రక్షణ నిమిత్తం లోకానికి ఇచ్చిందని నల్గొండ మేత్రాసన పీఠాధిపతులు, అభిషిక్త గురువులు మహా ఘన డాక్టర్‌ కరణం దమన్‌ కుమార్‌ అన్నారు. రెంటచింతలలోని ప్రఖ్యాత కానుకమాత చర్చిలో సోమవారం కానుకమాత చర్చి 176వ వార్షికోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. తొలుత స్థానిక విచారణ గురువులు రెవ.ఫాదర్‌ ఏరువ లూర్ధుమర్రెడ్డి నేతృత్వంలో రెవ.ఫాదర్‌ ఏరువ బాల శౌర్రెడ్డి, రెవ.ఫాదర్‌ కాసు జోజిరెడ్డిలతో కలిసి కానుకమాత చర్చి 176వ వార్షిక తిరునాళ్ల మహోత్సవ సమష్టి దివ్య బలిపూజలో భక్తులను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. సమాజంలో నెలకొన్న అశాంతి తొలిగి పోవాలంటే క్రీస్తు ప్రభువు సూక్తులను ఆచరిస్తూ ఆయన చూపిన బాటలో నడవాలన్నారు. ప్రభువును ప్రేమించే విషయంలో, ఇతరులకు సేవ చేసే విషయంలో పల్నాటి పౌరుషం చూపాలన్నారు. ఇరుగు పొరుగు వారిని దయాహృదయంతో ఆదుకోవాలన్నారు.

దివ్యాపూజాబలి సమర్పించిన నల్గొండ మేత్రాసన పీఠాధిపతి మహా ఘన

డాక్టర్‌ కరణం దమన్‌కుమార్‌

అంగరంగ వైభవంగా కానుకమాత తిరునాళ్ల1
1/1

అంగరంగ వైభవంగా కానుకమాత తిరునాళ్ల

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement