నీట్‌ ఎస్‌ఎస్‌లో సాతులూరు వైద్యుడి ప్రతిభ | - | Sakshi
Sakshi News home page

నీట్‌ ఎస్‌ఎస్‌లో సాతులూరు వైద్యుడి ప్రతిభ

Jan 26 2026 4:53 AM | Updated on Jan 26 2026 4:53 AM

నీట్‌

నీట్‌ ఎస్‌ఎస్‌లో సాతులూరు వైద్యుడి ప్రతిభ

అ‘పూర్వ’ ఆత్మీయ సమావేశం

నాదెండ్ల: జాతీయస్ధాయిలో నిర్వహించిన నీట్‌ సూపర్‌ స్పెషాలిటీ వైద్యవిద్య ప్రవేశ పరీక్షల్లో పల్నాడు జిల్లా నాదెండ్ల మండలం సాతులూరు గ్రామానికి చెందిన డాక్టర్‌ నార్నె సాయివెంకటేష్‌ 400వ ర్యాంకు సాధించి సత్తా చాటారు. వ్యవసాయ కుటుంబానికి చెందిన నార్నె రామచంద్రయ్య, అపర్ణతులసి దంపతులకు ఇరువురు కుమారులుకాగా, పెద్ద కుమారుడు సాయివెంకటేష్‌ కజకిస్తాన్‌లో ఎంబీబీఎస్‌ పూర్తి చేసి అనంతరం గన్నవరం సిద్ధార్థ మెడికల్‌ కళాశాలలో ఎండీ పూర్తి చేశారు. ప్రస్తుతం అదే కళాశాలలో ఫ్యాకల్టీగా పనిచేస్తున్నారు. ఇటీవల జరిగిన నీట్‌ సూపర్‌స్పెషాలిటీ వైద్య ప్రవేశపరీక్షలో ర్యాంకు సాధించి పలువురి మన్ననలు పొందారు. ఈయన సోదరుడు నాగతరుణ్‌ హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం చేస్తున్నారు.

నరసరావుపేట: స్థానిక మున్సిపల్‌ బాలుర ఉన్నత పాఠశాలలో 1979–80లో పదో తరగతి చదివిన పూర్వవిద్యార్థుల అపూర్వ ఆత్మీయ సమ్మేళనం స్థానిక ఐఎంఏ హాల్లో ఆదివారం ఆనందోత్సాహాల మధ్య జరిగింది. దాదాపు నాలుగున్నర దశాబ్దాల తర్వాత కలిసిన ఆ మిత్రులు ఆత్మీయంగా పలుకరించుకున్నారు. నాడు పాఠశాలలో చదువుకున్న, ఆడుకున్న మధుర జ్ఞాపకాలను గుర్తుచేసుకొని మురిసిపోయారు. ప్రస్తుతం తాము ఏం చేస్తున్నారో చెబుతూ కుటుంబ సభ్యుల వివరాలను పంచుకున్నారు. తమకు విద్యాబుద్ధులు నేర్పిన గురువులను స్మరించుకున్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. ఆత్మీయ సమావేశాన్ని పూర్వవిద్యార్థులు నిర్మాప్రసాద్‌, భూసా సాంబశివరావు, బేతపూడి రాధ, కాకుమాను శ్రీనివాసరావు, చల్లా నాగరాజు నిర్వహించారు. ఏటా సమావేశం ఏర్పాటు చేసుకుందామని తీర్మానించుకుని, ఆత్మీయ వీడ్కోలు పలికారు.

దక్షిణ భారత సైన్స్‌ పోటీలో జిల్లాకు ద్వితీయ స్థానం

నరసరావుపేట ఈస్ట్‌: దక్షిణ భారత వైజ్ఞానిక ప్రదర్శన– 2026లో పల్నాడుజిల్లా సత్తా చాటినట్టు జిల్లా సైన్స్‌ ఆఫీసర్‌ ఎస్‌.రాజశేఖర్‌ ఆదివారం తెలిపారు. హైదరబాద్‌లో ఈ నెల 19 నుంచి 24 వ తేదీ వరకు నిర్వహించిన ప్రదర్శనలో ఆరు రాష్ట్రాల నుంచి ప్రాజెక్టులు రాగా, ఆంధ్రప్రదేశ్‌ నుంచి ప్రాతినిధ్యం వహించిన నకరికల్లు మండలం కండ్లగుంట జెడ్పీ ఉన్నత పాఠశాల భౌతికశాస్త్ర ఉపాధ్యాయుడు గవిని శ్రీనివాసరావు రూపొందించిన విద్యుదయస్కాంతత్వం ప్రాజెక్ట్‌కు ద్వితీయ బహుమతి లభించిందని తెలిపారు. 10వ తరగతి భౌతిక రసాయన శాస్త్రంలో కఠినంగా భావించే విద్యుదయస్కాంతత్వం పాఠ్యాంశాన్ని సులభంగా అర్థమయ్యేలా 16 నమూనాలను శ్రీనివాసరావు రూపొందించారు. టెస్టర్‌, బల్బుల అనుసంధానం, సమాంతర సంధానం, అయస్కాంత బలరేఖలు, ఫారడే ప్రయోగం తదితర నమూనాలు న్యాయనిర్ణేతలను ఆకట్టుకున్నాయి. శ్రీనివాసరావును జిల్లా విద్యాశాఖాధికారి పీవీజే రామారావు, సైన్స్‌ అధికారి రాజశేఖర్‌, పాఠశాల ప్రధానోపాధ్యాయుడు వరప్రసాద్‌, ఉపాధ్యాయులు అభినందించారు.

నీట్‌ ఎస్‌ఎస్‌లో సాతులూరు వైద్యుడి ప్రతిభ 1
1/3

నీట్‌ ఎస్‌ఎస్‌లో సాతులూరు వైద్యుడి ప్రతిభ

నీట్‌ ఎస్‌ఎస్‌లో సాతులూరు వైద్యుడి ప్రతిభ 2
2/3

నీట్‌ ఎస్‌ఎస్‌లో సాతులూరు వైద్యుడి ప్రతిభ

నీట్‌ ఎస్‌ఎస్‌లో సాతులూరు వైద్యుడి ప్రతిభ 3
3/3

నీట్‌ ఎస్‌ఎస్‌లో సాతులూరు వైద్యుడి ప్రతిభ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement