జిల్లా మత్స్యశాఖ అధికారిగా ప్రసాద్
నరసరావుపేట: మత్స్యశాఖ పల్నాడు జిల్లా అధికారిగా బి.ప్రసాద్ నియమితులయ్యారు. ఈ మేరకు ఆ శాఖ కమిషనర్ రామశంకరనాయక్ ఉప జిల్లా అధికారిగా ఉన్న ప్రసాద్‌కు జిల్లా పూర్తి బాధ్యతలు అప్పగించారు. మూడేళ్లుగా జిల్లా అధికారిగా పనిచేస్తున్న సంజీవరావును కోర్టు ఆదేశాల మేరకు సస్పెండ్ చేసిన విషయం విధితమే. నియమ నిబంధనలు పాటించకుండా విధులు నిర్వహించి ప్రభుత్వ నిధుల దుర్వినియోగానికి పాల్పడ్డారనే ఆరోపణలపై జిల్లా అధికారి సంజీవరావుతోపాటు ఫిషరీస్ డెవలప్‌మెంట్ అధికారి భాగ్యలత, ఫిషరీస్ అసిస్టెంట్ ఇన్‌స్పెక్టర్ శ్రీనివాసులు కూడా సస్పెండ్ అయినట్లు జిల్లా అధికారి ప్రసాదు వెల్లడించారు.


