క్షీణించిన శాంతిభద్రతలు | - | Sakshi
Sakshi News home page

క్షీణించిన శాంతిభద్రతలు

Feb 1 2026 3:29 AM | Updated on Feb 1 2026 3:29 AM

క్షీణించిన శాంతిభద్రతలు

క్షీణించిన శాంతిభద్రతలు

క్షీణించిన శాంతిభద్రతలు

తిరుమల లడ్డూ విషయమై టీడీపీ చేసిన ఆరోపణలు అబద్ధమని తేలడంతో డైవర్షన్‌ పాలిటిక్స్‌కు చంద్రబాబు తెర లేపారు. అందులో భాగంగానే మాజీ మంత్రి అంబటి రాంబాబుపై హత్యాయత్నం. రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయి. దీనికి ఉదాహరణ అంబటి ఇంటిపై దాడే. పోలీసులు దగ్గర ఉండి దాడులను ప్రోత్సహించారు. ప్రజాస్వామ్యంలో ఇలాంటి దాడులు సరికాదు. కొన్ని గంటలపాటు గుంటూరులో అశాంతిని నెలకొల్పారు. దాడులను పూర్తిగా ఖండిస్తున్నా. వెంటనే అంబటి రాంబాబుకు రక్షణ కల్పించాలి. ప్రజాస్వామ్య బద్ధంగా వ్యవహరించాల్సిన ప్రభుత్వం పోలీసులు అండతో ఇలాంటి హింసలకు పాల్పడటం సరికాదు. రాంబాబుకు ప్రాణహాని ఉంది. ఏమైనా జరిగితే ప్రభుత్వమే బాధ్యత వహించాలి. వైఎస్సార్‌సీపీ ఆయనకు అండగా నిలుస్తుంది.

– నంబూరు శంకరరావు, మాజీ ఎమ్మెల్యే

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement