అమరేశ్వరుని సేవలో ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి
అమరావతి: అమరావతిలోని శ్రీబాలచాముండికా సమేత అమరేశ్వర స్వామిని ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ గీతామిట్టల్ శనివారం దర్శించుకున్నారు. అమరేశ్వరునికి, బాలచాముండేశ్వరీ అమ్మవారికి జస్టిస్ గీతామిట్టల్ ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆలయ వేదపండితులు ఆశీర్వదించగా, ఆలయ అధికారులు స్వామివారి శేషవస్త్రం, తీర్థప్రసాదాలు, స్వామివారి చిత్రపటం అందజేశారు.
చాగంటివారిపాలెం(ముప్పాళ్ళ): మండలంలోని చాగంటివారిపాలెం గ్రామంలో వేంచేసియున్న సుభద్ర బలభద్ర సహిత జగన్నాథస్వామి ఆలయ 14వ వార్షికోత్సవ వేడుకలు శనివారం ఘనంగా నిర్వహించారు. ఉదయం స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు పొంగళ్లు చేసి మొక్కులు సమర్పించుకున్నారు. సాయంత్రం శ్రీరాధాకృష్ణుల శాంతి కళ్యాణ మహోత్సవం నిర్వహించారు. భక్తులు కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్నారు. అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు అందించారు.
కారెంపూడి: కారెంపూడి పీహెచ్‌సీని అదనపు డీఎంహెచ్‌ఓ డాక్టర్ కె.మాధవీలత శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. పీహెచ్‌సీలోని రికార్డులు తనిఖీ చేశారు. రోజువారీ ఓపీ వారికి అందుతున్న వైద్య సేవల గురించి పీహెచ్‌సీ వైద్యాధికారిణి డాక్టర్ జి. రమ్య, డాక్టర్ కె. లక్ష్మీమౌనికలను అడిగి తెలుసుకున్నారు. స్పర్శ కార్యక్రమం కింద కుష్ఠువ్యాధి లేని సమాజాన్ని చూసేందుకు సంబంధిత శాఖ ఉద్యోగులు అందరూ కృషి చేయాలని కోరారు. సీహెచ్‌ఎ మల్లయ్య, ఉద్యోగులతో అడిషినల్ డీఎంహెచ్‌ఓ సమావేశం నిర్వహించారు.
బాపట్ల: బాపట్ల జిల్లా గనులు–భూగర్భ విభాగం అసిస్టెంట్ డైరెక్టర్‌గా జి.శ్రీనివాస్ నియమితులయ్యారు. ప్రస్తుతం పార్వతీపురం మన్యం జిల్లా గనులు–భూగర్భ విభాగం కార్యాలయంలో అసిస్టెంట్ జియాలజిస్ట్‌గా పనిచేస్తున్న ఆయన పదోన్నతి పొందారు. ఈ సందర్భంగా ఆయన శనివారం బాపట్ల కలెక్టర్ డాక్టర్ వి. వినోద్ కుమార్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు.
అమరేశ్వరుని సేవలో ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి
అమరేశ్వరుని సేవలో ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి
అమరేశ్వరుని సేవలో ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి
అమరేశ్వరుని సేవలో ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి


