పిడుగురాళ్లలో ఖాకీచకం! | - | Sakshi
Sakshi News home page

పిడుగురాళ్లలో ఖాకీచకం!

Feb 1 2026 3:29 AM | Updated on Feb 1 2026 3:29 AM

పిడుగ

పిడుగురాళ్లలో ఖాకీచకం!

పిడుగురాళ్లలో ఖాకీచకం!

వైఎస్సార్‌ సీపీ సోషల్‌ మీడియా జిల్లా ఉపాధ్యక్షుడు షేక్‌ మాబును అజ్ఞాత ప్రాంతానికి తరలించిన పోలీసులు మాబుతోపాటు ఆయన సోదరుడు నన్నె సైదాను బలవంతంగా తీసుకెళ్లిన వైనం కుటుంబ సభ్యులు ఫోన్‌లో ప్రశ్నిస్తే అక్కడే వదిలేశామని నిర్లక్ష్యంగా తెలిపిన పిడుగురాళ్ల టౌన్‌ సీఐ హైకోర్టులో హెబియస్‌కార్పస్‌ పిటిషన్‌ దాఖలు చేసిన మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్‌రెడ్డి

పిడుగురాళ్ల రూరల్‌: వైఎస్సార్‌ సీపీ సోషల్‌ మీడియా విభాగం జిల్లా ఉపాధ్యక్షుడు షేక్‌ మాబును పిడుగురాళ్ల పట్టణ పోలీసులు అక్రమంగా అరెస్టు చేసినట్లు తెలుస్తోంది. పల్నాడు జిల్లా పిడుగురాళ్ల మండలం బ్రాహ్మణపల్లి గ్రామంలో శనివారం సాయంత్రం సమయంలో మాబు తన టైర్ల దుకాణంలో ఉండగా పిడుగురాళ్ల పట్టణ ఎస్‌ఐ మోహన్‌ తన సిబ్బందితో కలిసి మఫ్టీలో వచ్చి మాబును స్టేషన్‌కు రావాలని పిలవగా ఎందుకు రావాలని.. తనపై ఎవరు, ఏం కేసు పెట్టారని, వారెంట్‌ చూపించాలని కోరాడు. తమ మా వెంట వస్తే పద్ధతిగా ఉంటుందని చెప్పి పోలీసులు మాబుని లాక్కొని వెళ్లే ప్రయత్నం చేశారు. ఈ ప్రయత్నంలో ఎంతసేపటికీ మాబు రాకపోవటంతో పోలీసులు అందరు చూస్తుండగానే మాబుపై దాడికి దిగారు. వెంటనే మాబు వాళ్ల అన్న షేక్‌ నన్నె సైదా మా తమ్ముడిని ఎందుకు తీసుకొని వెళ్తు న్నారని పోలీసులను ప్రశ్నించగా నిన్ను కూడా లోపల వేస్తాం, అప్పుడు తెలుస్తుంది.. ఎందుకు తీసుకొని వెళ్తున్నామో అని అన్నదమ్ములను బలవంతంగా అక్కడే ఉన్న సీఐ కారులోకి ఎక్కించారు. బ్రాహ్మణపల్లి గ్రామం నుంచి మాబు, మాబు వాళ్ల అన్న నన్నె సైదాను పోలీసులు తీసుకొని వెళ్లారు. వెంటనే మాబు తమ్ముడు జానీ సీఐకి ఫోన్‌ చేసి మా అన్నలను ఎందుకు అరెస్టు చేశారని ఫోన్‌లో వివరాలు అడగ్గా.. మీ అన్నయ్యలను అక్కడే దించామని వివరాలు చెప్పకుండా ఫోన్‌ పెట్టాశాడు. ఈ విషయమై వివరణ కోరేందుకు ‘సాక్షి’ సీఐ, ఎస్‌ఐలకు ఫోన్‌ చేయగా.. స్పందించలేదు.

హైకోర్టులో హెబియస్‌కార్పస్‌ పిటిషన్‌..

విషయం తెలుసుకున్న వెంటనే మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్‌రెడ్డి మాబు కుటుంబ సభ్యులతో ఫోన్‌లో మాట్లాడారు. బ్రాహ్మణపల్లి గ్రామానికి చెందిన తమ పార్టీ సోషల్‌ మీడియా జిల్లా ఉపాధ్యక్షుడు షేక్‌ మాబు, అతని సోదరుడు నన్నె సైదాలను పోలీసులు మఫ్టీలో వచ్చి కారు ఎక్కించుకొని తీసుకొని వెళ్లారని, వారు ఏమయ్యారో తెలియజేయాలని హైకోర్టులో హెబియస్‌కార్పస్‌ పిటిషన్‌ను దాఖలు చేశారు.

పిడుగురాళ్లలో ఖాకీచకం! 1
1/1

పిడుగురాళ్లలో ఖాకీచకం!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement