మున్సిపల్ కార్యాలయంలో ఏసీబీ అధికారుల విచారణ
మున్సిపల్ కార్యాలయంలో ఏసీబీ అధికారుల విచారణ రైలు నుంచి జారిపడి
వృద్ధుడు మృతి
నరసరావుపేట టౌన్: రైలు నుంచి జారిపడి గుర్తు తెలియని వృద్ధుడు మృతి చెందిన సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు రైల్వే ఎస్‌ఐ డాక్టర్ ఎం. రాజమోహన్‌రావు మంగళవారం తెలిపారు. నరసరావుపేట రైల్వేస్టేషన్ పరిధిలోని గుండ్లకమ్మ రైల్వేస్టేషన్ సమీపంలో రైలు నుంచి జారిపడి 60 సంవత్సరాల వయస్సు గల వృద్ధుడు మృతి చెందాడన్నారు. మృతుడు తెలుపురంగు చొక్కా, తెలుపు రంగు నైట్ ఫ్యాంట్ ధరించి ఉన్నాడన్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఏరియా వైద్యశాలకు తరలించామన్నారు. మృతుడి ఆనవాళ్లు తెలిసిన వారు నరసరావుపేట రైల్వే స్టేషన్‌లో సంప్రదించాలని ఎస్‌ఐ కోరారు. వ్యవసాయ కార్మిక సంఘం కార్యవర్గం నరసరావుపేట ఈస్ట్: ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ, కార్మిక సంఘం పల్నాడు జిల్లా నూతన కార్యవర్గం అధ్యక్షునిగా దారివేముల మరియబాబు, వైదన వెంకట్ నియమితులయ్యారు. అరండల్‌పేటలోని సీపీఐ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన సంఘం నిర్మాణ సమావేశంలో నూతన కార్యవర్గంను ఏకగ్రీవంగా ఎన్నిక చేస్తూ తీర్మానించారు. కార్యవర్గ వివరాలను మంగళవారం ప్రకటించారు. నూతన కార్యవర్గం కోశాధికారిగా దాసరి వరహాలు, జిల్లా కమిటీ సభ్యులుగా శ్రీపతి కోటేశ్వరరావు, చౌటుపల్లి నాగేశ్వరరావు, సోమవరపు దావీదు, నేరెళ్ల కొండలు, జె.వెంకటేశ్వర్లు, కొణతం దావీదు, పెదకూరపాడు ఓంకాళీ నియమితులయ్యారు. నూతన అధ్యక్ష, కార్యదర్శులు మరియబాబు, వెంకట్ మాట్లాడుతూ జిల్లాలోని గ్రామీణ ప్రాంతాలలో వ్యవసాయ కార్మికుల సమస్యలు పరిష్కారం కోసం కృషి చేస్తామని తెలిపారు. గ్రామాలలో సంఘం నిర్మాణం చేపడతామన్నారు. నూతన కార్యవర్గాన్ని సీపీఐ జిల్లా కార్యదర్శి మారుతి వరప్రసాదు, సహాయ కార్యదర్శులు షేక్.హుస్సేన్, కాసా రాంబాబు తదితరులు అభినందించారు. బీఈడీ మూడో సెమిస్టర్
పరీక్ష ఫలితాలు విడుదల 18 నుంచి టెక్నికల్
సర్టిఫికెట్ కోర్సు పరీక్షలు గుంటూరు ఎడ్యుకేషన్: టెక్నికల్ సర్టిఫికెట్ కోర్సు–2026 (టీసీసీ)లో భాగంగా డ్రాయింగ్, టైలరింగ్, ఎంబ్రాయిడరీలో లోయర్, హయ్యర్ గ్రేడ్ పరీక్షలు ఈనెల 18 నుంచి 21 వరకు జరగనున్నాయని జిల్లా విద్యాశాఖాధి కారి డాక్టర్ షేక్ సలీమ్ బాషా మంగళవారం ఓప్రకటనలో తెలిపారు. అభ్యర్థులు బీఎస్‌ఈఏపీ.ఓఆర్జీ వెబ్‌సైట్ నుంచి హాల్ టిక్కెట్లను డౌన్‌లోడ్ చేసుకోవాలని సూచించారు. గుంటూరు నగరంపాలెంలోని స్టాల్ బాలికోన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన పరీక్షా కేంద్రంలో టైలరింగ్, ఎంబ్రాయిడరీ, మార్కెట్ సెంటర్లోని హిందూ కాలేజీ హైస్కూల్లో ఏర్పాటు చేసిన పరీక్షా కేంద్రంలో డ్రాయింగ్ పరీక్షలు ఆయా తేదీల్లో ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట, తిరిగి మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరుగుతాయని పేర్కొన్నారు. అభ్యర్థులు పరీక్ష కేంద్రానికి గంట ముందుగా చేరుకోవాలన్నారు.
వినుకొండ: వినుకొండ మున్సిపల్ కార్యాలయంలో మంగళవారం ఏసీబీ అధికారులు విచారణ చేపట్టారు. గతంలో వినుకొండ మున్సిపల్ కార్యాలయంలో ఆర్‌ఐగా పనిచేస్తూ పదోన్నతిపై ఆర్‌ఓగా వినుకొండలోనే విధులు నిర్వహిస్తు దర్శి అదనపు మున్సిపల్ కమిషనర్‌గా వ్యవహిస్తూ.. మహేష్ ఇటీవల అక్రమ ఆస్తుల కేసులో అరెస్టు అయ్యారు. దీనిపై ఏసీబీ అధికారుల విచారణ చేపట్టారు. మున్సిపల్ కమిషనర్ సుభాష్ చంద్రబోస్‌తోపాటు మున్సిపల్ మేనేజర్‌లను ఆర్‌ఐ మహేష్‌కు సంబంధించి సర్వీసు వివరాలు తెలుసుకున్నారు. ఏసీబీ అధికారుల రాకతో మున్సిపల్ అధికారులు ఆందోళనకు గురయ్యారు.
ఏఎన్‌యూ(పెదకాకాని): రెగ్యులర్ బీఈడీ మూడో సెమిస్టర్ పరీక్ష ఫలితాలను పరీక్షల నిర్వహణ అధికారి ఆలపాటి శివప్రసాదరావు మంగళవారం విడుదల చేశారు. ఏఎన్‌యూ పరిధిలో 2025లో జరిగిన బీఈడీ మూడో సెమిస్టర్‌కు 6534 మంది హాజరు కాగా వారిలో 5650 మంది ఉత్తీర్ణులయ్యారు. 86.47 శాతం ఉత్తీర్ణత సాధించారు. విద్యార్థులు ఈనెల 12వ తేదీలోగా రీవాల్యేషన్‌కు దరఖాస్తు చేసుకోవాలన్నారు. రీవాల్యేషన్ దరఖాస్తులను పీజీ కోఆర్డినేటర్ కార్యాలయంలో 13వ తేదీలోగా సమర్పించాలన్నారు. ఒక్కొక్క సబ్జెక్ట్‌కు రీవాల్యేషన్ ఫీజు రూ.1860 చెల్లించాల్సి ఉంటుందన్నారు. పర్సనల్ వెరిఫికేషన్ ఫీజు రూ.2190 గా నిర్ణయించామన్నారు. పూర్తి వివరాలకు ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం అధికారిక వెబ్‌సైట్‌ను పరిశీలించాలన్నారు.
1/1
మున్సిపల్ కార్యాలయంలో ఏసీబీ అధికారుల విచారణ