గోనుగుంట్ల నోరు అదుపులో పెట్టుకో!
టీడీపీ నేతలకు చెంచాగిరి చేసే నువ్వా అంబటి గురించి మాట్లాడేది? వైఎస్సార్ సీపీ దివ్యాంగుల విభాగం జిల్లా అధ్యక్షుడు సయ్యద్ అహ్మద్ గోరా
సత్తెనపల్లి: తెలుగుదేశం పార్టీకి చెందిన దివ్యాంగుల కార్పొరేషన్ చైర్మన్ గోనుగుంట్ల కోటేశ్వరరావు నోరు అదుపులో పెట్టుకోవాలని వైఎస్సార్ సీపీ దివ్యాంగుల విభాగం జిల్లా అధ్యక్షుడు సయ్యద్ అహ్మద్ గోరా హెచ్చరించారు. వైఎస్సార్ సీపీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి అంబటి రాంబాబు పై గోనుగుంట్ల కోటేశ్వరరావు చేసిన అనుచిత వ్యాఖ్యలను ఆయన ఖండించారు. సత్తెనపల్లిలో సోమవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. మాజీ మంత్రి అంబటి రాంబాబుపై గోనుగుంట్ల కోటేశ్వరరావు మాట్లాడిన మాటలు అత్యంత హేయమన్నారు. రాష్ట్రవ్యాప్తంగా చంద్రబాబు ప్రభుత్వం లక్షలాది మంది దివ్యాంగుల పింఛన్లు తొలగిస్తూ నోటీసులు ఇచ్చినప్పుడు గోనుగుంట్ల కోటేశ్వరరావు ఎవరి చెంచాగిరి చేస్తున్నాడని ప్రశ్నించారు. 21 రకాల వైకల్యాల ఉపకరణ తయారీ కేంద్రాలు మూసివేసిన చంద్రబాబుని నిలదీసే సత్తా, దమ్ము లేక వైఎస్సార్ సీపీ నాయకులు, ప్రజాప్రతినిధులపై నోరు పారేసుకోవడం గోనుగుంట్లకే చెల్లిందన్నారు. టీడీపీ నేతలకు చెంచాగిరి చేసే గోనుగుంట్ల అంబటిపై విమర్శలు చేయడం హాస్యాస్పద మన్నారు. మరోసారి నోరుజారి ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే దివ్యాంగులే నీకు తగిన రీతిలో బుద్ధి చెబుతారని హెచ్చరించారు.


