నిలిచిన మీటర్‌ రీడింగ్‌ | - | Sakshi
Sakshi News home page

నిలిచిన మీటర్‌ రీడింగ్‌

Feb 4 2026 7:22 AM | Updated on Feb 4 2026 7:22 AM

నిలిచ

నిలిచిన మీటర్‌ రీడింగ్‌

నిలిచిన మీటర్‌ రీడింగ్‌ ● కాంట్రాక్ట్‌ ఉద్యోగులుగా గుర్తిస్తామని టీడీపీ హామీ ● రెండేళ్లుగా కార్యరూపం దాల్చకపోవడంతో ఆందోళన ● ప్రారంభం కాని ఫిబ్రవరి విద్యుత్‌ రీడింగ్‌ పనులు ● స్లాబ్‌ మారిపోయి బిల్లు అధికంగా వచ్చే అవకాశం ● విద్యుత్‌ వినియోగదారులకు తప్పని పెను భారం సమ్మెబాట పట్టిన విద్యుత్‌ మీటర్‌ రీడింగ్‌ ఉద్యోగులు

వైఎస్‌ జగన్‌

హయాంలో

సానుకూలం

సత్తెనపల్లి: మూడు రోజులుగా విద్యుత్‌ మీటర్ల నుంచి బిల్లులు తీసే ప్రక్రియ నిలిచిపోయింది. ఈ పరిణామం విద్యుత్‌ వినియోగదారుల్లో ఆందోళన రేకెత్తిస్తోంది. బిల్లులు తీయడం ఆలస్యమైతే .. విద్యుత్‌ వినియోగంలో స్లాబ్‌ పెరిగి పోయి బిల్లులు అధికంగా వచ్చే అవకాశం ఉందని వాపోతున్నారు. ఇప్పటికే పెరిగిన విద్యుత్‌ బిల్లులతో ఆర్థికంగా అతలాకుతులం అవుతుంటే .. మరింతగా బిల్లులు పెరిగితే ఎలాగనే ప్రశ్న తలెత్తుతోంది.

జిల్లాలో ఇలా...

జిల్లా వ్యాప్తంగా 7,48,449 గృహ, వాణిజ్య సర్వీసులు, 594 వరకు హెచ్‌టీ సర్వీసులు ఉన్నాయి. నెలకు ఎల్‌టీ సర్వీసులకు 309.6 మిలియన్‌ యూనిట్ల, హెచ్‌టీ సర్వీసులకు 179.17 మిలియన్‌ యూనిట్ల విద్యుత్‌ను వినియోగిస్తున్నారు. ప్రతి నెల ఎల్‌టీ సర్వీసుల నుంచి రూ. 51.12 కోట్లు, హెచ్‌టీ సర్వీసుల నుంచి రూ. 87.72 కోట్లు బిల్లులు విద్యుత్‌ శాఖకు వినియోగదారులు చెల్లిస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా 246 మంది విద్యుత్‌ మీటర్‌ రీడర్లు విధులు నిర్వర్తిస్తున్నారు. ప్రతి నెల ఒకటో తేదీ నుంచి 11వ తేదీ లోపు మీటరు రీడింగ్‌ తీస్తారు. ఒక మీటర్‌కు రీడింగ్‌ తీసినందుకుగాను విద్యుత్‌ శాఖ సంబంధిత కాంట్రాక్టర్‌ పట్టణ ప్రాంతాల్లో రూ. 6.16, గ్రామీణ ప్రాంతాల్లో రూ.6.36 చొప్పున చెల్లిస్తారు. ఈ మొత్తం సరిపోవడం లేదని కాంట్రాక్టర్లు డిమాండ్‌ చేయటంతో పట్టణాల్లో రూ.0.26 పైసలు, గ్రామాల్లో రూ. 0.75 పైసలు పెంచారు. రీడింగ్‌ యంత్రం చార్జీలు, ఫోన్‌ రీచార్జ్‌, రీడింగ్‌ పేపర్‌ రోల్‌, మరమ్మతులు, ఈఎస్‌ఈ, ఈపీఎఫ్‌ మినహమింపులు పోగా .. విద్యుత్‌ మీటర్‌ రీడర్‌ కు చేతికి ఒక్కో మీటర్‌కు రూ.3.10 మాత్రమే అందుతుంది. సగటున ఒక్క మీటర్‌ రీడర్‌ నెలకు మూడు వేల మీటర్ల వరకు రీడింగ్‌ తీస్తారు. దీన్నిబట్టి చూస్తే వారి ఆదాయం ప్రతినెలా కేవలం రూ. 7 వేల నుంచి రూ. 10 వేల లోపే ఉంటుంది. ప్రాంతాన్ని, పట్టణాన్ని బట్టి రీడింగ్‌ సామర్థ్యం మారుతుంది.

స్మార్ట్‌ మీటర్ల ఏర్పాటుతో సంస్థలో ఏళ్లుగా పనిచేస్తున్న కొందరు సిబ్బందికి ఉపాధి దక్కదు. ప్రతిపక్షంలో ఉన్న సమయంలో స్మార్ట్‌ మీటర్ల ఏర్పాటుకు వ్యతిరేకిచిన సీఎం చంద్రబాబు ప్రస్తుతం గ్రీన్‌ సిగ్నల్‌ ఇవ్వడంపై వినియోగదారులు, ప్రజలు విమర్శలు గుప్పిస్తున్నారు. వ్యవసాయ బోరు బావుల వద్ద స్మార్ట్‌ మీటర్లు పెడితే పగలగొట్టండని పిలుపునిచ్చిన చంద్రబాబు, నారా లోకేష్‌ ప్రస్తుతం వాటిని అమర్చేందుకు వేగంగా అడుగులు వేయడంపై రైతుల్లో ఆగ్రహవేశాలు వ్యక్తమవుతున్నాయి. విద్యుత్‌ సంస్థనే నమ్ముకుని పనిచేస్తున్న మీటర్‌ రీడర్ల ఉపాధికి గండి పడుతోంది. వినియోగదారులు విద్యుత్‌ రీచార్జీపై అవగాహన లేకపోతే ఇబ్బందులు తప్పవు. విద్యుత్‌ చౌర్యం పెరిగే అవకాశం ఉంది. విద్యుత్తు లైన్ల నుంచి విద్యుత్‌ అక్రమంగా వినియోగించుకునే వారి సంఖ్య పెరగడానికి అవకాశాలు ఉన్నాయి.

చంద్రబాబు ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ప్రతి రంగంలో సంక్షోభం నెలకొంటోంది. సాఫీగా సాగే వ్యవస్థలను సైతం గందరగోళంలోకి నెట్టేస్తోంది. ఇప్పటికే అనేక వ్యవస్థల నిర్వీర్యానికి ఆజ్యం పోసిన సర్కారు తాజాగా విద్యుత్‌ స్పాట్‌ బిల్లింగ్‌పై పడింది. విద్యుత్‌ మీటర్‌ రీడర్ల సమస్యల పరిష్కారం కోసం చొరవ చూపక పోవడంతో వారు సమ్మె బాట పట్టారు.

గత వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వంలో స్మార్ట్‌ మీటర్లు ఏర్పాటు చేయనున్న సమయంలో మీటర్‌ రీడర్లు ఆందోళన చెందారు. దీంతో స్పందించిన అప్పటి సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మీటర్‌ రీడర్లకు ప్రత్యామ్నాయం కల్పిస్తామంటూ హామీ ఇచ్చారు. విద్యుత్‌ శాఖలోనే ఉపాధి కల్పిస్తామని భరోసా కల్పించారు. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పట్టించుకోవడం మానేసింది.

నిలిచిన మీటర్‌ రీడింగ్‌ 1
1/1

నిలిచిన మీటర్‌ రీడింగ్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement