గొలుసు దొంగల విజృంభణ
మూడు పోలీసు స్టేషన్‌లలో చైన్ స్నాచింగ్ కేసుల నమోదు కనీస పురోగతి లేని దర్యాప్తులు నరసరావుపేటలో ప్రశ్నార్థకంగా పోలీసింగ్ ఒంటరి మహిళలే లక్ష్యంగా దుండగుల దోపిడీ ద్విచక్ర వాహనంపై వచ్చి గొలుసులు లాక్కెళ్తున్న చోరులు
నరసరావుపేట టౌనన్: జిల్లా కేంద్రమైన నరసరావుపేటలో రెండు నెలల వ్యవధిలో చోటు చేసుకున్న గొలుసు చోరీ కేసుల్లో పురోగతి లేకపోవటం ఆందోళన కలిగిస్తోంది. ఒంటరి మహిళలను లక్ష్యంగా చేసుకొని చోరులు చెలరేగిపోతున్నారు. నరసరావుపేటలో అసలు పోలీసింగ్ ప్రశ్నార్థకంగా మారిందన్న విమర్శలు సర్వత్రా వ్యక్తం అవుతున్నాయి.
ఇవిగో నిదర్శనాలు..
బయటకు రావాలంటే బెంబేలు..
పట్టణంలో ఓ వైపు గొలుసు దొంగతనాలు, మరో వైపు ద్విచక్రవాహన చోరీలు పెరిగి పోవటంతో పట్టణవాసులు ఆందోళన చెందుతున్నారు. దర్యాప్తులో ఇద్దరు యువకులు బైకులపై వచ్చి బంగారు గొలుసులు లాక్కెళ్లారని పోలీసులు భావిస్తున్నారు. అదేవిధంగా ద్విచక్ర వాహన దొంగతనాలు నిత్యం ఏదో ఒక ప్రాంతంలో చోటు చేసుకుంటున్నాయి. ఇంటి ఎదుట నిలిపిన వాహనాలకు రక్షణ కరువైందని యజమానులు వాపోతున్నారు. ఇలా వరుస ఘటనలు జరుగుతున్నా అరికట్టడంలో పోలీసులు విఫలమయ్యారు. జిల్లా కేంద్రంలో పోలీసు ఉన్నతాధికారులు ఉన్నా చోరులు కనీసం లెక్క చేసే పరిస్థితులు కనిపించడం లేదు.
చంద్రబాబు పాలనలో ఇంటి ముందు ముగ్గు వేస్తున్న మహిళ నుంచి.. బజారుకు వెళ్తున్న గృహిణి వరకు... ఎవ్వరికీ రక్షణ లేకుండా పోయింది. ద్విచక్ర వాహనంపై వచ్చిన దుండగులు నిమిషాల వ్యవధిలో వారి మెడలోని బంగారు గొలుసులను లాక్కెళ్తున్నారు. పోలీసులకు బహిరంగ సవాల్ విసురుతున్నారు.


