కేంద్ర బడ్జెట్ దేశాభివృద్ధికి ఊతం
ఆల్ ఇండియా టుబాకో బోర్డు చైర్మన్ యశ్వంత్
నగరంపాలెం: జిల్లాలో పోలీస్ యాక్ట్ 30 అమల్లో ఉందని గుంటూరు పశ్చిమ డీఎస్పీ అరవింద్ మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఎటువంటి సభలు, సమావేశాలు, ర్యాలీలకు అనుమతి లేదన్నారు. అనుమతుల్లేని సభలు, ర్యాలీలు నిర్వహిస్తే వారిపై చట్టపరమైన చర్యలు ఉంటాయని ఆయన తెలిపారు.
మార్కెట్ కమిటీ పూర్తిస్థాయి నియామకం
కొరిటెపాడు: గుంటూరు మార్కెట్ యార్డు చైర్మన్‌గా కుర్రా అప్పారావు, వైస్ చైర్మన్‌గా బిట్రగుంట మల్లికలను నియమిస్తున్నట్లు రాష్ట ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి ఎ.వి.రాజమౌళి మంగళవారం సాయంత్రం జీవో విడుదల చేశారు. సభ్యులుగా కొనకళ్ల వెంకటసత్యనారాయణ, ముదావత్ మంగాబాయి, కె.విజయలక్ష్మి, మొహమ్మద్ హఫీజ్, మేళం సైదయ్య, షేక్ ఖాదర్‌బాయి, బత్తుల జాన్‌సైదా, దర్శనపు విజయమ్మ, చంద్రగిరి బాబు, ఇమ్మడి వెంకటలక్ష్మి, డి.భాగ్యారావు, ఎన్. వంశీకృష్ణ, కె.శ్రావణకుమారిలను నియమిస్తున్నట్లు జీవోలో పేర్కొన్నారు.
నగరంపాలెం: జీడీసీసీ బ్యాంక్ (నల్లపాడు బ్రాంచ్)లో నిధుల దుర్వినియోగం కేసులో మరొకర్ని అరెస్ట్ చేశామని గుంటూరు సీసీఎస్ డీఎస్పీ బీవీ.మధుసూదనరావు తెలిపారు. ఈ మేరకు మంగళవారం కేసు వివరాలను సీసీఎస్ డీఎస్పీ తెలిపారు. జీడీసీసీ బ్యాంక్ (నల్లపాడు బ్రాంచ్)లో నిధుల దుర్వినియోగంపై గతేడాది నవంబర్ 28న డివిజనల్ కో–ఆపరేటివ్ అధికారి కె.శీనారెడ్డి ఫిర్యాదుతో నల్లపాడు పీఎస్‌లో కేసు నమోదైందని అన్నారు. జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ ఆదేశాల మేరకు కేసు దర్యాప్తు చేపట్టామని చెప్పారు. ఈ మేరకు ఏ–8 అయిన బాపట్ల టౌన్ పటేల్‌నగర్ రెండో వీధిలో ఉంటున్న పీటా వెంకటేశ్వరావు కదలికలపై నిఘా ఉంచామని అన్నారు. ఈనెల రెండో తేదీన అతన్ని గుంటూరు బ్రాడీపేటలోని జీడీసీసీ బ్యాంక్ సమీపాన అరెస్ట్ చేశామన్నారు. గతంలో వెంకటేశ్వరరావు నల్లపాడు జీడీసీసీ బ్యాంక్ పాలకవర్గంలో సభ్యుడిగా నామినేట్ చేశారని తెలిపారు. అతన్ని కోర్టులో హాజరుపరచగా, 14 రోజుల న్యాయస్థాన కస్టడీకి ఆదేశించారని అన్నారు. పరారీలో ఉన్న కొందర్ని త్వరలో అరెస్ట్ చేస్తామన్నారు.
కేంద్ర బడ్జెట్ దేశాభివృద్ధికి ఊతం
కేంద్ర బడ్జెట్ దేశాభివృద్ధికి ఊతం


