నేటి నుంచి ఒంగోలు జాతి ఎడ్ల బండలాగుడు పోటీలు | - | Sakshi
Sakshi News home page

నేటి నుంచి ఒంగోలు జాతి ఎడ్ల బండలాగుడు పోటీలు

Feb 2 2026 7:49 AM | Updated on Feb 2 2026 7:49 AM

నేటి నుంచి ఒంగోలు జాతి ఎడ్ల బండలాగుడు పోటీలు

నేటి నుంచి ఒంగోలు జాతి ఎడ్ల బండలాగుడు పోటీలు

నేటి నుంచి ఒంగోలు జాతి ఎడ్ల బండలాగుడు పోటీలు

నాదెండ్ల: నాదెండ్లలోని నందికుంట విఘ్నేశ్వరస్వామి ఆలయ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని సోమవారం నుంచి ఈనెల 6వ తేది వరకూ జాతీయ స్థాయి ఒంగోలు జాతి వృషభరాజముల బండలాగుడు పోటీలు నిర్వహించనున్నారు. పోటీల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు కమిటీ సభ్యులు ఏర్పాటు చేశారు. సోమవారం ఉదయం రెండు పళ్ల విభాగం, 3న ఉదయం నా లుగు పళ్ల విభాగం, సాయంత్రం ఆరు పళ్ల విభాగం, 4న ఉదయం న్యూకేటగిరి, సాయంత్రం నుండి 5వ తేదీ వరకూ జూనియర్స్‌ విభాగంలో, 6న సీనియర్స్‌ విభాగంలో జరగనున్నాయి. అనౌన్సర్లుగా గూడా శ్రీనివాసరావు, తంగేడు హు స్సేన్‌ వ్యవహరించనున్నారు. ఏడు విభాగాల్లో రూ.12.12 లక్షల నగదు బహుమతితోపాటూ షీల్డ్‌లను విజేతలకు అందించనున్నారు. వివరాలకు 9399925522, 9989618760, 949285 6290 నంబర్ల నందు సంప్రదించాలని కోరారు.

ప్రశాంతంగా ఇంటర్‌ ప్రాక్టికల్స్‌

నరసరావుపేట ఈస్ట్‌: ఇంటర్మీడియెట్‌ ప్రాక్టికల్‌ పరీక్షలు ఆదివారం ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. ఇంటర్‌ ఒకేషనల్‌ విద్యార్థుల ప్రాక్టికల్‌ పరీక్షలు జనవరి 27వ తేదీ నుంచి ప్రారంభం కాగా, జనరల్‌ విద్యార్థుల ప్రాక్టికల్స్‌ ఆదివారం ప్రారంభమయ్యాయి. జిల్లా వ్యాప్తంగా ఏర్పాటు చేసిన 79 పరీక్ష కేంద్రాలలో ఆదివారం ఉదయం 2,535 మంది ఒకేషనల్‌, జనరల్‌ విద్యార్థులకు గాను 2,421మంది హాజరు కాగా 114మంది గైర్హాజరైనట్టు జిల్లా ఇంటర్మీడియెట్‌ విద్యాశాఖాధికారి ఎం.నీలావతిదేవి తెలిపారు. మధ్యాహ్నం 1,852 మందికి గాను 1,765మంది హాజరయ్యాని, మరో 87మంది గైర్హాజరు కాగా ఒకరు సప్లీ పరీక్షకు హాజరైనట్టు తెలిపారు. పరీక్ష కేంద్రాలలో సీసీ కెమెరాలను ఏర్పాటుచేసి వాటిని బోర్డుకు అనుసంధానం చేయటంతో పరీక్షల నిర్వహణ తీరును ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నట్టు వివరించారు.

ఉద్యోగ, ఉపాధ్యాయులను నిరాశపర్చిన కేంద్ర బడ్జెట్‌

ఏపీటీఎఫ్‌ నేతలు

గుంటూరుఎడ్యుకేషన్‌: పార్లమెంటులో ఆదివారం ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్‌ ఉద్యోగ, ఉపాధ్యాయులను నిరాశపర్చిందని ఏపీటీఎఫ్‌ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కె.బసవలింగారావు, మహమ్మద్‌ ఖాలీద్‌ ఓప్రకటనలో తెలిపారు. పెరుగు తున్న ద్రవ్యోల్బణం, ఆకాశాన్ని తాకుతున్న నిత్యావసరాల ధరలతో ఆదాయపు పన్ను పరిధి పెంచుతారని ఆశించిన మధ్యతరగతి, వేతన జీవులకు ఈ బడ్జెట్‌ పెద్ద షాక్‌ ఇచ్చిందన్నారు. పన్ను శ్లాబుల్లో ఎటువంటి మార్పు చేయకపోవడం, స్టాండర్డ్‌ డిడక్షన్‌ను పెంచకపోవడం వలన వేతన జీవులపై అదనపు భారం పడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. 8వ వేతన సవరణ సంఘ ఊసే లేకపోవడం, కేంద్ర ప్రభుత్వానికి ఉద్యోగులపై ఉన్న నిర్లక్ష్యానికి నిదర్శనమన్నారు. విద్యారంగానికి బడ్జెట్‌లో ఆశించిన స్థాయిలో కేటాయింపులు జరగలేదని పేర్కొన్నారు. డిజిటల్‌ ఎడ్యుకేషన్‌ పేరుతో ప్రచారానికే ప్రాధాన్యత ఇవ్వడం మినహా, క్షేత్రస్థాయిలో ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి నిధులు కరువయ్యాయని పేర్కొన్నారు. అదేవిధంగా కేంద్ర బడ్జెట్‌లో ఉద్యోగులు, ఉపాధ్యాయులకు తీవ్ర నిరాశ కలిగిందని ఏపీటీఎఫ్‌ (1938) రాష్ట్ర కార్యదర్శి మేకల సుబ్బారావు విమర్శించారు.

గంజాయి దాడులను

ప్రభుత్వాలు కట్టడి చేయాలి

తాడేపల్లిరూరల్‌: రెండు తెలుగు రాష్ట్రాల్లో గంజా యి దాడులు ఎక్కువయ్యాయని.. ఇద్దరు ముఖ్యమంత్రులు గంజాయిని నివారించి అమాయక ప్రజలు, ఉద్యోగులపై దాడులు జరగకుండా కా పాడాలని ఐద్వా రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు శ్రీదేవి, సావిత్రి ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొ న్నారు. నిజామాబాద్‌ జిల్లా మోస్రా మండలంలో ఎకై ్సజ్‌ కానిస్టేబుల్‌ సౌమ్య స్మగ్లర్ల దాడిలో మరణించిందని తెలిపారు. సౌమ్య కుటుంబానికి తెలంగాణ ప్రభుత్వం రూ.కోటి పరిహారం, ఉద్యోగం ఇస్తామని ప్రకటించినట్లు పేర్కొన్నారు. నెల్లూరు జిల్లాలో పెంచలయ్యను గంజాయి స్మగ్లర్‌ దాడి చేసి హత్య గురికాగా ప్రభుత్వం పెంచలయ్య కుటుంబాన్ని ఆదుకుంటామని చెప్పినా ఇప్పటి వరకు కనీసం పరామర్శించలేదన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement