అనధికార లే అవుట్లు ధ్వంసం చేసిన సీఆర్డీఏ | - | Sakshi
Sakshi News home page

అనధికార లే అవుట్లు ధ్వంసం చేసిన సీఆర్డీఏ

Feb 4 2026 7:22 AM | Updated on Feb 4 2026 7:22 AM

అనధికార లే అవుట్లు ధ్వంసం చేసిన సీఆర్డీఏ

అనధికార లే అవుట్లు ధ్వంసం చేసిన సీఆర్డీఏ

అమరావతి: మండలపరిధిలోని కర్లపూడి, లేమల్లె, ఎండ్రాయి, నరుకుళ్ళపాడు, అమరావతి, ధరణికోట, పెదమద్దూరు, వైకుంఠపురం, నెమలికల్లు గ్రామాల్లో అక్రమ లేఅవుట్లను ఏపీ సీఆర్డీఏ ఆధికారులు మంగళవారం ధ్వంసం చేశారు. సీఆర్డీఏ డెవలప్మెంట్‌ ప్రమోషన్‌ విభాగం అధికారుల ఆధ్వర్యంలో మొత్తం 22 ఎకరాలలోని 15 అనధికార లే అవుట్‌లను ధ్వంసం చేశారు సీఆర్డీఏ డెవలప్మెంట్‌ ప్రమోషన్‌ విభాగ గుంటూరు జోనల్‌ జాయింట్‌ డైరెక్టర్‌ మహాలక్ష్మి దొర, జోనల్‌ డిప్యూటీ డైరెక్టర్‌ కోటేశ్వరరావు, టౌన్‌ప్లానింగ్‌ అసిస్టెంట్‌ పావని, వార్డ్‌ ప్లానింగ్‌ – రెగ్యులేషన్‌ సెక్రటరీ రవీంద్రలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈసందర్భంగా జాయింట్‌ డైరెక్టర్‌ మహాలక్ష్మి దొర మాట్లాడుతూ మండలంలోని కర్లపూడిలోని సర్వే నెంబర్లు 292 295, 297, 299, 325, 332 సర్వేనెంబర్లలో ఎండ్రాయిలో 89,198, నరుకుళ్లపాడులో 123, ధరణికోటలో 346,99, అమరావతిలో 64, 65,151, పెదమద్దూరులో 77, వైకుంఠపురంలో 264, నెమలికల్లులో 122 సర్వేనెంబర్ల భూముల్లో ఏర్పాటవుతున్న అనధికార లేఅవుట్‌లను ధ్వంసం చేశామని తెలిపారు. సీఆర్డీఏ పరిధిలో అనధికార లేఅవుట్లను ఎట్టి పరిస్థితులలో ఉపేక్షించబోమని హెచ్చరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement