టీటీడీ లడ్డూ ప్రసాదంపై చంద్రబాబు క్షమాపణ చెప్పాలి | - | Sakshi
Sakshi News home page

టీటీడీ లడ్డూ ప్రసాదంపై చంద్రబాబు క్షమాపణ చెప్పాలి

Jan 31 2026 6:47 AM | Updated on Jan 31 2026 6:47 AM

టీటీడీ లడ్డూ ప్రసాదంపై చంద్రబాబు క్షమాపణ చెప్పాలి

టీటీడీ లడ్డూ ప్రసాదంపై చంద్రబాబు క్షమాపణ చెప్పాలి

● కలియుగ ప్రత్యక్ష దైవం వేంకటేశ్వరస్వామి వారి లడ్డూ ప్రసాదం తయారీలో కొవ్వు కలిసిందని చేసిన ఆరోపణలు అవాస్తవమని నిరూపితమైందన్నారు. గత ప్రభుత్వంలోనే జంతువుల కొవ్వు కలిసిందని, దీనికి పరోక్షంగా వైఎస్‌ జగన్‌మోహనరెడ్డే కారణమంటూ చేసిన ఆరోపణలకు వారిద్దరూ బహిరంగ క్షమాపణలు చెప్పాల్సిన అవసరం ఉందన్నారు. ● బోలె బాబా సంస్థ 2018లో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉండగానే తిరుమల తిరుపతి దేవస్థానానికి నెయ్యి సరఫరా చేసిందన్నారు. ఈ సంస్థ ప్రస్తుతం పేరు మార్చుకొని శ్రీహర్ష డెయిరీ పేరుతో కొనసాగుతుందని, నెయ్యిలో కల్తీ తెలుగుదేశం ప్రభుత్వ హయాం నుంచే మొదలైందని, దీనికి వారెందుకు శిక్షార్హులు కారని ప్రశ్నించారు. ● న్యాయవాది, పార్టీ ప్లానలిస్టు చిట్టా విజయభాస్కర్‌రెడ్డి మాట్లాడుతూ లడ్డూ ప్రసాదంపై ఎటువంటి బహిరంగ విమర్శలు చేసుకోకూడదని సుప్రీంకోర్టు ఉత్తర్వులు ఉన్నప్పటికీ వాటిని లెక్క చేయకుండా పల్నాడు జిల్లాలో అనేక ప్రాంతాల్లో టీడీపీ నాయకులు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారని, ఇది కోర్టు ధిక్కారమని, ఈ వ్యవహారంపై పార్టీ అధిష్టానం అనుమతి తీసుకొని అన్ని జిల్లా కేంద్రాలలో పోలీసుస్టేషన్లలో ఫిర్యాదులు చేస్తామని, కోర్టును సైతం ఆశ్రయిస్తామని చెప్పారు. ఫ్లెక్సీలు ముద్రించిన వారిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. సమావేశంలో పట్టణ అధ్యక్షులు షేక్‌ కరిముల్లా, వర్కింగ్‌ అధ్యక్షులు నిడమానూరి సురేంద్ర, రొంపిచర్ల మండల కన్వీనర్‌ కురుగుంట్ల శ్రీనివాసరెడ్డి, మండల ఉపాధ్యక్షులు పచ్చవ రవీంద్ర, బీసీ సెల్‌ అధ్యక్షులు అచ్చి శివకోటి పాల్గొన్నారు.

టీడీపీ హయాం నుంచే టీటీడీకి భోలే బాబా డెయిరీ నెయ్యి సరఫరా

టీడీపీ ఫ్లెక్సీల ఏర్పాటుపై పోలీస్‌స్టేషన్లలో ఫిర్యాదు నేడు నరసరావుపేట వేంకటేశ్వరస్వామి దేవాలయంలో 101 కొబ్బరికాయలు వైఎస్సార్‌సీపీ జిల్లా కార్యనిర్వాహక అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే డాక్టర్‌ గోపిరెడ్డి

నరసరావుపేట: తిరుమల వేంకటేశ్వరస్వామి లడ్డూ ప్రసాదం తయారీలో నెయ్యికి బదులుగా జంతువుల కొవ్వు కలిసిందనే ఆరోపణలు అబద్ధమని దర్యాప్తు సంస్థ సీబీఐ దాఖలు చేసిన చార్జిషీట్‌లో నిరూపతమైన దృష్ట్యా ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, పవన్‌ కల్యాణ్‌లు భక్తులకు క్షమాపణలు చెప్పాలని వైఎస్సార్‌సీపీ జిల్లా కార్యనిర్వాహక అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే డాక్టర్‌ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి డిమాండ్‌ చేశారు. శుక్రవారం గుంటూరు రోడ్డులోని పార్టీ కార్యాలయంలో నిర్వహించిన విలేకర్ల సమావేశంలో ప్లానలిస్టు చిట్టా విజయభాస్కరరెడ్డితో కలసి మాట్లాడారు.

● శనివారం బరంపేటలోని కల్యాణ వేంకటేశ్వరస్వామి దేవాలయంలో పార్టీ ఆధ్వర్యంలో 101 కొబ్బరికాయ కొట్టి లడ్డూ ప్రసాదంపై చంద్రబాబు నాయుడు వేసిన నిందను పూర్తిగా తొలగించమని ఆ దేవదేవుడిని ప్రార్థిస్తామని పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement