ఏఆర్ విధులే అత్యంత కీలకం
నగరంపాలెం: పోలీస్ శాఖలో ఏఆర్ విభాగం నిర్వర్తించే విధులు అత్యంత కీలకమని జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ అన్నారు. గురువారం జిల్లా పోలీస్ కార్యాలయ ఆవరణలోని హాల్‌లో జిల్లా ఏఆర్ వార్షిక మోబిలైజేషన్ (శిక్షణ) నిర్వహించారు. అనంతరం పోలీస్ కవాతు మైదానంలో పరేడ్ చేపట్టారు. జిల్లా ఎస్పీ మాట్లాడుతూ వీవీఐపీ, వీఐపీల నివాసాలు, ముఖ్య ప్రాంతాల్లో విధులు నిర్వర్తించే గార్డులు నిరంతరం అప్రమత్తంగా ఉండాలని అన్నారు. వీవీఐపీ, వీఐపీల వద్ద వ్యక్తిగత భద్రత విధులు నిర్వర్తించే వారి ప్రవర్తన శైలి, విధుల్లో పాటించాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించాలని అన్నారు. పర్యటనల వేళల్లో భద్రతా తనిఖీలపై అప్రమత్తత అవసరమని అన్నారు. క్రమశిక్షణతోపాటు శారీరక ధృఢత్వాన్ని పెంపొందించుకోవాలని సూచించారు. జిల్లా ఏఎస్పీ (ఏఆర్) హనుమంతు మాట్లాడుతూ రెండు వారాలపాటు శిక్షణ నిర్వహిస్తామని తెలిపారు. జిల్లాస్థాయిలో శాంతి, భద్రతల పరిరక్షణ మరింత పటిష్టంగా ఉంటుందని చెప్పారు. కార్యక్రమంలో ఆర్‌ఐలు శ్రీహరిరెడ్డి, శ్రీనివాసరావు, రామకృష్ణారెడ్డి, సురేష్, ఆర్‌ఎ్‌స్‌ఐలు, ఏఆర్ సిబ్బంది పాల్గొన్నారు.
అనుక్షణం అప్రమత్తంగా ఉండాలి..
సీఎం చంద్రబాబు పర్యటన దృష్ట్యా అనుక్షణం అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఏఎస్పీ (ఎల్/ఓ) ఏటీవీ.రవికుమార్ అన్నారు. సీఎం పర్యటన దృష్ట్యా గురువారం పోలీస్ కవాతు మైదానంలో బందోబస్త్ సిబ్బందికి జిల్లా ఏఎస్పీ బ్రీఫింగ్ చేశారు. ఆయన మాట్లాడుతూ వీవీఐపీ భద్రతపై అప్రమత్తంగా ఉండాలని అన్నారు. వీవీఐపీ మార్గాల్లోకి ఇతర వాహనాలు ప్రవేశించకుండా చూడాలని చెప్పారు. పోలీస్ అధికార, సిబ్బంది అనుసరించాల్సిన బందోబస్త్‌పై వివరించారు. అపరిచిత వ్యక్తులు, అనుమానాస్పద వస్తువులు కనిపిస్తే బీడీ బృందంతో తనిఖీలు చేయించాలని సూచించారు. తూర్పు డీఎస్పీ అజీజ్ మాట్లాడుతూ వీవీఐపీల రాకపోకల్లో ఎటువంటి అంతరాయం కలగకుండా విధులు నిర్వర్తించాలని సూచించారు. కొత్తపేట పీఎస్ సీఐ వీరయ్య, ఎస్‌ఐ డి.రమేష్ పాల్గొన్నారు.
జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్


