రాష్ట్రస్థాయి బెస్ట్‌ ఎలక్ట్రోరల్‌ అవార్డుకు ఎంపిక | - | Sakshi
Sakshi News home page

రాష్ట్రస్థాయి బెస్ట్‌ ఎలక్ట్రోరల్‌ అవార్డుకు ఎంపిక

Jan 25 2026 7:18 AM | Updated on Jan 25 2026 7:18 AM

రాష్ట్రస్థాయి బెస్ట్‌ ఎలక్ట్రోరల్‌ అవార్డుకు ఎంపిక

రాష్ట్రస్థాయి బెస్ట్‌ ఎలక్ట్రోరల్‌ అవార్డుకు ఎంపిక

రాష్ట్రస్థాయి బెస్ట్‌ ఎలక్ట్రోరల్‌ అవార్డుకు ఎంపిక బస్సు ఆపలేదని కండక్టర్‌పై దాడి

సత్తెనపల్లి: రాష్ట్ర స్థాయి బెస్ట్‌ ఎలక్ట్రోరల్‌ అవార్డుకు పల్నాడు జిల్లా నరసరావుపేట మండల పరిధిలోని గ్రామ సచివాలయంలో వీఆర్వోగా పనిచేస్తున్న షేక్‌ సైదా సాహెబ్‌ ఎంపిక య్యారు. నరసరావుపేట మండలం కేసానుపల్లి శివారు కొత్తపాలెం సచివాలయంలో గ్రామ రెవెన్యూ అధికారిగా ఆయన పని చేస్తున్నారు. కొత్తపాలెం పీఎస్‌ నెంబర్‌ 100 లో బూత్‌లెవల్‌ ఆఫీసర్‌ (బీఎల్‌ఓ)గా విధులు నిర్వహిస్తున్నారు. ఎన్నికల విధినిర్వ హణలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచినందుకు పల్నాడు జిల్లా తరఫున రాష్ట్ర స్థాయిలో బెస్ట్‌ ఎలక్ట్రోరల్‌ అవార్డుకు ఎంపికై నట్లు నరసరావుపేట ఆర్డీఓ మధులత తెలిపారు. జాతీయ ఓటర్ల దినోత్సవంను పురస్కరించుకొని ఈ నెల 25న విజయవాడ చీఫ్‌ ఎన్నికల అధికారి కార్యాలయంలో సైదాసాహెబ్‌ అవార్డును అందుకోనున్నారు.

నరసరావుపేట టౌన్‌: బస్సు ఆపలేదని మహిళ కండెక్టర్‌పై ప్రయాణికురాలు దాడి చేసి యూటీఎఫ్‌ మిషన్‌ను బయటకు విసిరేసిన సంఘటన శనివారం పట్టణంలో చోటు చేసుకుంది. వన్‌న్‌ టౌనన్‌ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నరసరావుపేట డిపోకు చెందిన ఏపీ 07 జెడ్‌ 0314 నంబర్‌ బస్సు ప్రయాణికులను ఎక్కించుకొని నరసరావుపేట నుంచి గుంటూరుకు బయలు దేరింది. బస్టాండ్‌ నుంచి బయటకు వస్తున్న సమయంలో బస్సులో ప్రయాణిస్తున్న షేక్‌ రహీమ్‌ మున్సిసా తమ బంధువులు వస్తున్నారని బస్సు ఆపాలని కండక్టర్‌ ఆవుల విష్ణు కుమారిని కోరింది. బస్సు నిలపక పోవటంతో కండక్టర్‌తో వాగ్వివాదానికి దిగి ఆమె చేతిలో ఉన్న టికెట్లు కొట్టే మిషన్‌ను కిటికీలోనుంచి బయటకు విసిరింది. అనంతరం కండక్టర్‌పై దౌర్జన్యానికి దిగి దాడి చేసింది. సంఘటనలో మిషన్‌ పాక్షికంగా దెబ్బతింది. తన విధులకు ఆటంకం కలిగించటంతో పాటు మిషనన్‌ను ధ్వంసం చేసిందని కండక్టర్‌ ఫిర్యాదు చేసింది. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ ఫిరోజ్‌ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement