అప్పుల కుప్ప!
ఆదాయంతోనే పనులు..
జిల్లాలో డివిజన్‌ల వారీగా ఏరియర్స్, తాజా పన్ను బకాయిలు
సత్తెనపల్లి: జిల్లాలో 28 మండలాలు ఉండగా 520 గ్రామపంచాయతీలు ఉన్నాయి. వీటిల్లో కేవలం దాచేపల్లి, పెదకూరపాడు, చిలకలూరిపేట, మాచవరం మండలాలు మాత్రమే పన్ను వసూళ్లలో ముందు వరుసలో ఉన్నట్లు ఈ నెల 29 నాటి గణాంకాలు చెబుతున్నాయి. బొల్లాపల్లి, అచ్చంపేట, ఈపూరు మండలాలు పన్ను వసూలులో చివరి వరుసలో ఉన్నాయి.
ఈ మండలాల్లో ఆశించిన మేర వసూళ్లు కనిపించడం లేదు. ఏటా రూ. కోట్లల్లో వసూలు చేయాల్సిన పన్నులే పంచాయతీలకు దన్నుగా నిలుస్తాయి. ఇక 15వ ఆర్థిక సంఘం నిధులు అభివృద్ధి పనులకు, మౌలిక సౌకర్యాల కల్పనకు వినియోగిస్తున్నారు. ఏటా ఆర్థిక వనరులను పెంచుకోవడం వాటి ద్వారా పంచాయతీల అభివృద్ధికి పాలక మండళ్లు శ్రద్ధ చూపించడం లేదు. దీనికి తోడు వసూలు చేయాల్సిన ఇంటి పన్నుల విషయంలో అధికారుల చర్యలు నామమాత్రంగానే ఉంటున్నాయి. దీనివల్ల పంచాయతీల్లో పనులకు ఇబ్బందికర పరిస్థితులు నెలకొంటున్నాయి. అధికారులు పన్నుల వసూళ్లకు టార్గెట్‌లు ఇస్తున్నా వాటి ఫలితాలు మాత్రం ఉండడం లేదని తాజా అప్పుల లెక్క చెబుతోంది.
వసూళ్లలో దాచేపల్లి అగ్రస్థానం .. బొల్లాపల్లి చివరి స్థానం ....
పంచాయతీల్లో పారిశుధ్య నిర్వహణ, గ్రీన్ అంబాసిడర్లకు వేతనాల చెల్లింపు, నీటి సరఫరా నిర్వహణ, బోర్ల నిర్వహణ ఇలాంటి పనులకు పంచాయతీకి వసూలయ్యే సాధారణ నిధుల తోనే చేపట్టాల్సి ఉంటుంది. దీనికి పన్నులు సకాలంలో వసూలు కావాలి. లేదంటే నిధుల కోసం కటకట లాడాల్సిందే. 15వ ఆర్థిక సంఘం నిధులు వస్తున్నా వాటిని దేని కోసం వెచ్చించాలో ప్రభుత్వమే సూచిస్తుంది. కాబట్టి ఆ పనులే చేయాల్సి ఉంటుంది. ఈ పరిస్థితుల్లో పంచాయతీల్లో నిధుల కొరత తీరాలంటే పన్ను ల వసూళ్లపై అధికారులు దృష్టి పెట్టాల్సి ఉంది.
డివిజన్ అసెస్‌మెంట్లు ఏరియర్స్ లక్షల్లో కరెంట్ లక్షల్లో మొత్తం లక్షల్లో
గురజాల 1,22,952 రూ. 209.36 రూ. 561.87 రూ. 771.23
నరసరావుపేట 1,41,482 రూ. 323.39 రూ. 601.66 రూ. 925.05
సత్తెనపల్లి 1,33984 రూ. 456.54 రూ. 604.55 రూ.1061.69
మొత్తం 3,98,418 రూ. 989.29 రూ.1768.08 రూ.2757.37
అప్పుల కుప్ప!


