జిల్లాలో 22 బార్లకు రీనోటిఫికేషన్
● ఫిబ్రవరి 4 వరకు దరఖాస్తుల స్వీకరణ
● 5న లాటరీ పద్ధతిలో బార్‌ల
కేటాయింపు
నరసరావుపేట టౌన్: జిల్లాలో 22 బార్ అండ్ రెస్టారెంట్‌లకు రీ–నోటిఫికేషన్ జారీ చేసినట్లు ఎకై ్సజ్ సూపరింటెండెంట్ కె.మణికంఠ తెలిపారు. బుధవారం కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లా వ్యాప్తంగా 22 బార్ల భర్తీకి రీ–నోటిఫికేషన్ జారీ చేస్తూ జిల్లా కలెక్టర్ గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసినట్లు తెలిపారు. వీటిలో నరసరావుపేట మున్సిపాలిటీ పరిధిలో 7, చిలకలూరిపేట మున్సిపాలిటీలో 5, పిడుగురాళ్ల మున్సిపాలిటీలో 4, మాచర్లలో 3, వినుకొండలో 3 ఉన్నట్లు తెలిపారు. నేటి నుంచి ఫిబ్రవరి 4వ తేదీ సాయంత్రం 6గంటల వరకు దరఖాస్తులను స్వీకరిస్తారన్నారు. దరఖాస్తుల స్వీకరణ ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ పద్ధతిలో ఉంటుందన్నారు. దరఖాస్తు రుసుము రూ.5 లక్షలు, ప్రాసెసింగ్ ఫీజు రూ.10,000 మొత్తం రూ.5,10,000 నాన్ రిఫండబుల్ అని తెలిపారు. ఒక్కో బార్‌కు కనీసం నాలుగు దరఖాస్తులు వస్తేనే ఆ దుకాణానికి లాటరీ పద్దతిన టెండర్ పిలవటం జరుగుతుందన్నారు. వచ్చిన దరఖాస్తులను ఫిబ్రవరి 5వ తేదీన పల్నాడు జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో లాటరీ తీసి కేటాయించటం జరుతుతుందని తెలిపారు. సమావేశంలో సీఐ సోమయ్య పాల్గొన్నారు.


