గుంటూరు వెస్ట్(క్రీడలు): గుంటూరు జిల్లా బాక్సింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆదివారం స్థానిక బీఆర్ స్టేడియంలో జిల్లా స్థాయి అండర్–17, 19 బాలుర బాక్సింగ్ పోటీలు నిర్వహించారు. పోటీల పర్యవేక్షణను అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ కె.చిరంజీవి, బాక్సింగ్ కోచ్ రామిశెట్టి విశ్వనాఽథ్‌లు పర్యవేక్షించారు. చిరంజీవి మాట్లాడుతూ ఎంపికై న జట్లు 21 నుంచి 23 వరకు విశాఖలో జరగనున్న రాష్ట్ర పోటీలకు పంపిస్తామన్నారు.
ఎంపికై న క్రీడాకారులు..
అండర్–19 : సీహెచ్ అభిషిత్ పాల్, రామేశ్వర్, ఎన్.లోకేష్ చౌదరి, అండర్–17లో జి.సాయిహర్ష, బి.దేవ సుధాకర్, ఎస్.కుశ్వంత్ రాజ్ కుమార్, ఎస్.చరణ్ దీప్, బి.వెంకట మనోహర్, ఎస్.సత్యకుమార్, పి.కార్తీక్, ఎస్.రోహిత్ కుమార్, ఎస్.విజయ్ కుమార్, జి.కనిష్క్, జి.సాయిరామ్ చరణ్ ఉన్నారు.


