పంట కాలువలో మహిళ మృతదేహం లభ్యం | - | Sakshi
Sakshi News home page

పంట కాలువలో మహిళ మృతదేహం లభ్యం

Feb 3 2026 7:37 AM | Updated on Feb 3 2026 7:37 AM

పంట కాలువలో మహిళ మృతదేహం లభ్యం

పంట కాలువలో మహిళ మృతదేహం లభ్యం

పంట కాలువలో మహిళ మృతదేహం లభ్యం

చీరాల: పంట కాలువలో మహిళ మృతదేహం సోమవారం చీరాలలో కలకలం రేగింది. పంట కాలువలో మహిళ మృతదేహం లభించడంతో స్థానికంగా భయాందోళనకు గురిచేసింది. చీరాల మండలం ఈపూరుపాలెం పోలీస్‌స్టేషన్‌ పరిధిలో తోటవారిపాలెం 216 హైవే పక్కన కాలువలో మహిళ మృతదేహం తేలుతూ కనిపించింది. మృతదేహాన్ని చూసిన స్థానికులు భయాందోళనకు గురై పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పరిశీలించారు. మృతురాలు వయస్సు 25–30 మధ్య ఉంటుందని భావిస్తున్నారు. మరణించి రెండు, మూడు రోజులు అయి ఉంటుందని, మృతురాలికి సంబంధించిన ఆధారాలేమీ లభించలేదన్నారు. సంఘటనా స్థలానికి డీఎస్పీ ఎండీ మొయిన్‌ చేరుకొని మృతదేహాన్ని పరిశీలించారు. హత్య, ఆత్మహత్య అనే కోణంలో పూర్తిస్థాయిలో దర్యాప్తు చేస్తున్నట్లు డీఎస్పీ తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం చీరాల ఏరియా వైద్యశాలకు తరలించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement