హోరాహోరీగా ఎడ్ల బలప్రదర్శన పోటీలు
ప్రథమస్థానంలో నిలిచిన సూర్యాపేట జిల్లా గిత్తలు
రెంటచింతల: స్థానిక కానుకమాత చర్చి 176 వ వార్షిక తిరునాళ్ల మహోత్సవాన్ని పురస్కరించుకుని సెయింట్ జోసఫ్స్ ఉన్నత పాఠశాల క్రీడామైదానంలో మంగళవారం నిర్వహించిన జాతీయ స్థాయి ఒంగోలు జాతి ఎడ్ల బలప్రదర్శన నువ్వానేనా అన్నట్లు హోరాహోరీగా జరిగాయి. సీనియర్ విభాగంలో జరిగిన ఈ ప్రదర్శనను చూడటానికి అనేక ప్రాంతాల నుంచి వేలాదిమంది తరలిరావడంతో క్రీడామైదానం కిక్కిరిసిపోయింది. ఈ విభాగంలో తెలంగాణ రాష్ట్రం సూర్యాపేట జిల్లా హూజూరునగర్‌కు చెందిన ఏఎస్పీ సుంకు సురేందర్ రెడ్డి ఎడ్లు 2,656.8 అడుగులు దూరంలాగి ప్రథమ బహుమతి రూ.2.70 లక్షల విలువైన రాయల్ ఇన్‌ఫీల్డ్(బుల్లెట్)ను కై వశం చేసుకున్నాయి. వైఎస్సార్ కడప జిల్లా చౌటప్పల్ గ్రామానికి చెందిన మార్తల చంద్ర ఓబుల్‌రెడ్డి ఎడ్లు 2,637.10 అడుగుల దూరంలాగి 2వ బహుమతి రూ. 1.40 లక్షల విలువైన యూనికార్న్ బైక్‌ను దక్కించుకున్నాయి. వైఎస్సార్ కడప జిల్లా కల్లూరు గ్రామానికి చెందిన పెరుమాళ్ళ శివకృష్ణ యాదవ్ ఎడ్లు 2,519 అడుగులు దూరంలాగి 3వ బహుమతి కై వసం చేసుకున్నాయి. కృష్ణా జిల్లా విజయవాడ గన్నవరంకు చెందిన కాసనేని రాజాచౌదరి, వల్లభనేని మోహన్‌రావు ఎడ్లు 2,511.2 అడుగుల దూరంలాగి లాగి 4వ బహుమతి, బాపట్ల జిల్లా చుండూరు మండలం వేటపాలెం గ్రామానికి చెందిన అత్తోట శిరీషా చౌదరి, శివకృష్ణ చౌదరి ఎడ్లు 2,502.4 అడుగులు దూరంలాగి 5 వ బహుమతి, నంద్యాల జిల్లా ఎస్.కొత్తూరు గ్రామానికి చెందిన బీరం సుబ్రమణ్యేశ్వరరెడ్డి, నంద్యాల జిల్లా చాగలమర్రి గ్రామానికి చెందిన బాపతి కొండారెడ్డి కంబైన్డ్ డెడ్లు 2,342 అడుగుల దూరంలాగి 6 వ బహుమతి, వైఎస్సార్ కడప జిల్లా చౌటప్పల్ గ్రామానికి చెందిన మార్తల చంద్ర ఓబుల్‌రెడ్డి ఎడ్లు 2,141.4 అడుగుల దూరంలాగి 7 వ బహుమతి, నంద్యాల జిల్లా పెద్దకోట్టాల గ్రామానికి చెందిన బోరెడ్డి కేశవరెడ్డి ఎడ్లు 2,110.4 అడుగులతో 8 వ బహుమతి, నంద్యాల జిల్లా టి.హుసేనాపురం గ్రామానికి చెందిన ఎం. రామచంద్రారెడ్డి ఎడ్లు 2,042 అడుగులు దూరంలాగి 9 వ బహుమతి, కృష్ణా జిల్లా మల్లవల్లి గ్రామా నికి చెందిన అక్కినేని ముకుల్ సత్య చౌదరి ఎడ్లు 1,815 అడుగులు లాగి 10వ బహుమతి రూ. 14 వేలను గెలుచుకున్నాయి.
● అదేవిధంగా 11, 12, 13, 14, 15 జతలకు పోత్సాహక బహుమతులు అందజేశారు. ఈ విభాగంలో 15 జతలు పాల్గొనగా నిర్వహించిన బలప్రదర్శనలో మొత్తం 8 విభాగాలలో 123 జతల ఎడ్లు పాల్గొన్నట్లు కమిటీ సభ్యులు వైఎల్ మర్రెడ్డి, ఆదూరి ఇన్నారెడ్డి, గొంటు సుమంత్‌రెడ్డి, ఏరువ జోజిరెడ్డి, బి. రామకృష్ణ, ఎం. రాజారెడ్డి, ఎం. చిన్న శౌర్రెడ్డి, కె. జోసఫ్‌రెడ్డి, జె. రాజేష్‌రెడ్డి, ఒ.ఇన్నారెడ్డి తెలిపారు. న్యాయనిర్ణేతలుగా రాధాకృష్ణ, పి.సుబ్బారెడ్డి, దుర్గి శ్రీనివాసరావు వ్యవహరించారు.
హోరాహోరీగా ఎడ్ల బలప్రదర్శన పోటీలు


