17 ఏళ్లు నిండిన వారు ఓటరుగా నమోదు చేసుకోవాలి | - | Sakshi
Sakshi News home page

17 ఏళ్లు నిండిన వారు ఓటరుగా నమోదు చేసుకోవాలి

Jan 26 2026 4:53 AM | Updated on Jan 26 2026 4:53 AM

17 ఏళ్లు నిండిన వారు ఓటరుగా నమోదు చేసుకోవాలి

17 ఏళ్లు నిండిన వారు ఓటరుగా నమోదు చేసుకోవాలి

17 ఏళ్లు నిండిన వారు ఓటరుగా నమోదు చేసుకోవాలి

జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ కృతికా శుక్లా ఘనంగా జాతీయ ఓటరు దినోత్సవం పట్టణంలో అవగాహన ర్యాలీ

నరసరావుపేట: జిల్లాలో 17 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు చేసుకునేందుకు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ కృతికా శుక్లా పిలుపునిచ్చారు. ఆదివారం స్థానిక కలెక్టరేట్‌లోని పీజీఆర్‌ఎస్‌ సమావేశ మందిరంలో జాతీయ ఓటరు దినోత్సవం నిర్వహించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ ముందుగానే దరఖాస్తు చేసుకుంటే 18 ఏళ్లు నిండగానే ఓటరు కార్డు పొందవచ్చన్నారు. ఆధారాలతో ఆన్‌లైన్‌లో సులభంగా ఎవరికి వారే దరఖాస్తు సమర్పించవచ్చన్నారు. ప్రజాస్వా మ్యంలో ఓటు వేయాల్సిన బాధ్యత అందరిపైనా ఉంటుందని, ఓటరుగా నమోదు చేసుకున్న వారు మాత్రమే ఓటు వేసే అవకాశం పొందుతారని తెలి పారు. ఎవరికి వారు తమ పేర్లు, తమ కుటుంబ సభ్యుల పేర్లు ఓటరు జాబితాలో ఉన్నాయో, లేదో గమనించుకుంటూ ఉండాలన్నారు. ఓటు హక్కు ఆవశ్యకత గురించి వ్యాసరచన, ఉపన్యాస పోటీలలో ఉత్తమ ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు కలెక్టర్‌ అవార్డులు ప్రదా నం చేశారు. నూతనంగా ఓటరుగా గుర్తింపు పొందిన యువతకు కార్డులు అందజేశారు. సుదీర్ఘ కా లంగా ఓటు హక్కు వినియోగించుకుంటున్న సీనియర్‌ సిటిజన్లను సత్కరించారు. తొలుత మున్సిపల్‌ కార్యాలయం నుంచి కలెక్టరేట్‌ వరకూ ఓటరు నమోదు కార్యక్రమంపై ‘నా దేశం–నా ఓటు’ నినాదంతో అవగాహన ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో ఆర్డీవో మధులత, తహసీల్దార్‌ వేణుగోపాల్‌ పలువురు జిల్లా అధికారులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement