గణతంత్ర ఏర్పాట్లు పరిశీలన
నరసరావుపేట: నరసరావుపేటలో సోమవారం నిర్వహించే 77వ గణతంత్ర దినోత్సవ వేడుకల ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ డాక్టర్ కృతికా శుక్ల ఆదివారం పరిశీలించారు. కలెక్టరేట్ సమీపంలోని పరేడ్ మైదానంలో వేడుకలు నిర్వహించనున్నారు. చేసిన ఏర్పాట్లను గురించి ఆర్‌డీఓ కె.మధులత, తహసీల్దార్ కె.వేణుగోపాలరావు ఆమెకు వివరించారు. అలాగే జిల్లా అధికారులకు తేనేటి విందు ఇచ్చేందుకు కలెక్టర్ క్యాంపు కార్యాలయం కూడా ముస్తాబైంది. అక్కడి ఏర్పాట్లను కలెక్టర్ పరిశీలించారు. కాగా, వేడుకల సందర్భంగా జిల్లా వ్యాప్తంగా వివిధ విభాగాల్లో పనిచేస్తున్న 203మంది అధికారులు, ఎన్‌జీఓలకు అవార్డులను అందజేయనున్నారు.


