● చీరాల ఆర్వోబీ కింద మృతదేహాన్ని కనుగొన్న స్థానికులు ● కత్తిపోట్లు, తలపై తీవ్ర గాయాలు ● మృతుడు స్వర్ణ వాసిగా గుర్తింపు | - | Sakshi
Sakshi News home page

● చీరాల ఆర్వోబీ కింద మృతదేహాన్ని కనుగొన్న స్థానికులు ● కత్తిపోట్లు, తలపై తీవ్ర గాయాలు ● మృతుడు స్వర్ణ వాసిగా గుర్తింపు

Jan 29 2026 6:19 AM | Updated on Jan 29 2026 6:19 AM

● చీరాల ఆర్వోబీ కింద మృతదేహాన్ని కనుగొన్న స్థానికులు ●

● చీరాల ఆర్వోబీ కింద మృతదేహాన్ని కనుగొన్న స్థానికులు ●

● చీరాల ఆర్వోబీ కింద మృతదేహాన్ని కనుగొన్న స్థానికులు ● కత్తిపోట్లు, తలపై తీవ్ర గాయాలు ● మృతుడు స్వర్ణ వాసిగా గుర్తింపు

మెడికల్‌ వ్యాపారికి జైలు

నరసరావుపేట టౌన్‌: పట్టణానికి చెందిన ప్రముఖ మెడికల్‌ వ్యాపారి కూనిశెట్టి శ్రీనివాసులుకు చెల్లని చెక్కు కేసులో 6 నెలల జైలు శిక్ష, రూ.10 లక్షల జరిమానా విధిస్తూ మొదటి అదనపు జూనియర్‌ సివిల్‌ జడ్జి కోర్టు బుధవారం తీర్పు చెప్పింది. పట్టణానికి చెందిన తూనుగుంట్ల సుబ్బారావు వద్ద వాసవీ మెడికల్‌ వ్యాపారి కూనిశెట్టి శ్రీనివాసులు 2019 సంవత్సరంలో రూ.10 లక్షలు అప్పుగా తీసుకున్నాడు. చెల్లింపులో భాగంగా చెక్కు అందజేశాడు. ఖాతాలో నగదు లేకపోవటంతో బాధితుడు కోర్టును ఆశ్రయించాడు. నేరం రుజువు కావటంతో న్యాయమూర్తి నిందితుడికి 6 నెలల జైలు శిక్ష విధించారు. ఫిర్యాదు దారుడికి రూ.10 లక్షలు చెల్లించాలని తీర్పులో పేర్కొన్నారు.

అందుబాటులో ఎండీటీ మందులు

నరసరావుపేట: కుష్ఠువ్యాధిని ఎండీటీ (బహుళ ఔషధ చికిత్స) మందుల ద్వారా పూర్తిగా నయం చేయవచ్చని, ఈ మందులు ప్రభుత్వాసుపత్రుల్లో ఉచితంగా అందజేస్తారని జిల్లా వైద్యఆరోగ్యశాఖ అధికారి డాక్టర్‌ బి.రవి పేర్కొన్నారు. ఈనెల 30 నుంచి వచ్చే నెల 13వ తేదీ వరకు జిల్లా వ్యాప్తంగా నిర్వహిస్తున్న స్పర్శ లెప్రసీ అవేర్‌నెస్‌ క్యాంపెయిన్‌పై బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ ఏడాది వివక్షత అంతం చేయటం, గౌరవాన్ని కాపాడటం అనే నినాదంతో ఈ అవగాహన కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. ఈ వ్యాధి ఉన్నవారు దగ్గినా, తుమ్మినా ఒకరి నుంచి మరొకరికి సంక్రమిస్తుందన్నారు. వ్యాధిగ్రస్తులను త్వరగా గుర్తించి చికిత్స అందజేస్తే అంగవైకల్యం రాకుండా కాపాడవచ్చన్నారు.

యువకుడి హత్య!

చీరాల: చీరాల్లోని రైల్వే ఓవర్‌ బ్రిడ్జి కింద బుధవారం యువకుడి మృతదేహం కలకలం రేపింది. ఆర్వోబీ కింద రైలు పట్టాల మధ్య రక్తమడుగులో ఉన్న యువకుడి మృతదేహాన్ని చూసిన స్థానికులు భయభ్రాంతులకు గురై పోలీసులకు సమాచారం అందించారు. ఒన్‌టౌన్‌ సీఐ ఎస్‌.సుబ్బారావు మృతదేహాన్ని పరిశీలించారు. మృతదేహాంపై కత్తి పోట్లు, తీవ్ర గాయాలు ఉండటంతో దారుణంగా కొట్టి హత్య చేశారని స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ కోణంలో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. యువకుడి మృతిపై సోషల్‌ మీడియాలో వచ్చిన కథనాల ఆధారంగా మృతుడి వివరాలు లభించాయి. మృతుడు కారంచేడు మండలం స్వర్ణ గ్రామానికి చెందిన కొండె త్రినాఽథ్‌(17)గా గుర్తించారు. మృతుడు ఎలక్ట్రీషియన్‌గా పనిచేస్తున్నాడు. దీంతో మృతుడి బంధువులు చీరాల వచ్చి గుర్తించారు. అనంతరం మృతుడు వినియోగించిన బైక్‌ ఘటనా స్థలానికి దగ్గరలో కనుగొన్నారు. మంగళవారం రాత్రి పనికి వెళుతున్నానని చెప్పి బైక్‌పై చీరాల వచ్చాడు. అయితే రాత్రి ఇంటికి వెళ్లలేదు. ఉదయం చీరాల ఆర్వోబీ కింద శవమై కనిపించాడు. మృతి గల కారణాలను పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మృతుడి తలపై, శరీరంపై ఉన్న గాయాలను బట్టి దుండగులు రైల్వే వంతెన దగ్గకు తీసుకువచ్చి రాళ్ళతో కొట్టి చంపి పడవేసి ఉంటారని భావిస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం చీరాల ఏరియా వైద్యశాలకు తరలించారు. ఈ ఘటనపై ఒన్‌టౌన్‌ పోలీసులు కేసు నమోదు చేసి సీసీ టీవీ ఫుటేజ్‌ ఆధారంగా దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement