కళాకారుడు రవికుమార్‌కు జాతీయ పురస్కారం
సత్తెనపల్లి: సత్తెనపల్లికి చెందిన రంగస్థల, పౌరాణిక కళాకారుడు బెజగం రవికుమార్‌కి నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఇండియన్ ఐకాన్ జాతీయ పురస్కారం ప్రదానం చేశారు. తెలుగు వెలుగు సాహితీ వేదిక గ్రేటర్ వరంగల్‌లో ఈనెల 25న నిర్వహించిన జాతీయ పురస్కారాల ప్రదానోత్సవంలో సత్తెనపల్లికి చెందిన బెజగం కుమార్ 2015 నుంచి ఇప్పటి వరకు రెండు తెలుగు రాష్ట్రాల్లో వివిధ కళాపరిషత్‌ల్లో విభిన్న, వైవిద్య పౌరాణిక పాత్రలలో ప్రదర్శనలు చేసి ప్రేక్షకులను రంజింప జేసి నందుకుగాను ఈ జాతీయ పురస్కారం ప్రదానం చేశారు. జాతీయ పురస్కారం అందుకుంన్న రవికుమార్‌ను సత్తెనపల్లిలోని వివిధ కళా సంస్థల ప్రతినిధులు, మిత్రులు, శ్రేయోభిలాషులు సోమవారం ప్రత్యేకంగా అభినందించారు.


