రసవత్తరంగా ఎడ్ల బలప్రదర్శన పోటీలు
రెంటచింతల: ఫిబ్రవరి 2వ తేదీన నిర్వహించనున్న స్థానిక కానుకమాత చర్చి 176 తిరునాళ్ల మహోత్సవాన్ని పురస్కరించుకుని మంగళవారం స్థానిక సెయింట్ జోసఫ్స్ ఉన్నత పాఠశాల క్రీడామైదానంలో నిర్వహిస్తున్న జాతీయ స్థాయి ఒంగోలు జాతి ఎడ్ల బలప్రదర్శన రసవత్తరంగా జరిగాయి. రెండు పళ్ల సైజ్ విభాగంలో జరిగిన ఈ ప్రదర్శనలో బాపట్ల జిల్లా చుండూరు మండలం వేటపాలెం గ్రామానికి చెందిన అత్తోట శిరీషా చౌదరి, శివకృష్ణ చౌదరిల గిత్తలు 4,082.10 అడుగుల దూరం లాగి ప్రథమ బహుమతి రూ. 50 వేలను కై వశం చేసుకున్నాయి. గుంటూరు జిల్లా పత్తిపాడు మండలం కొండేపాడు గ్రామానికి చెందిన చాగంటి శ్రీనివాస చౌదరి, ప్రకాశం జిల్లా నాగుల్పుడు మండలం ఉప్పుగుడూరు గ్రామానికి చెందిన బెల్లం రిత్వీక్ చౌదరి, యువాన్ చౌదరి కంబైన్డ్ గిత్తలు 3,880.2 అడుగుల దూరం లాగి రెండవ బహుమతి రూ.35 వేలను దక్కించుకున్నాయి. పల్నాడు జిల్లా నర్సరావుపేట మండలం దొండపాడు గ్రామానికి చెందిన యర్రం రాజశేఖర్, యశ్వంత్ గిత్తలు 3,603.1 అడుగుల దూరంలాగి 3వ బహుమతి రూ. 30 వేలను కై వశం చేసుకున్నాయి. కృష్ణా జిల్లా నాగాయలంక మండలం తలగడదీవికి చెందిన ఉమ్మారెడ్డి ప్రభుకుమారి, గుంటూరు జిల్లా ఫిరంగిపురం మండలం కండ్రిక గ్రామానికి చెందిన నుసుముల రామకృష్ణామాచారి కంబైన్డ్ గిత్తలు 3,361.5 అడుగుల దూరంలాగి 4 వ బహుమతి రూ.25 వేలను దక్కించుకున్నాయి. తెలంగాణ నాగర్‌కర్నూల్ జిల్లా ఉప్పునూతల మండలం వెల్లటూరు గ్రామానికి చెందిన శివరామకృష్ణ గిత్తలు 3,258.2 అడుగుల దూరం లాగి 5వ బహుమతి రూ. 17 వేలను గెలుచుకున్నాయి. ఇలా పదవ స్థానం వరకు బహుమతులు పంపిణీ చేశారు. బలప్రదర్శనలో మొత్తం 15 జతలు పాల్గొనగా మిగిలిన 5 జతలకు కూడ రూ. 4 వేల చొప్పున ప్రోత్సాహక బహుమతులుగా అందజేసినట్లు కమిటీ సభ్యులు వైఎల్ మర్రెడ్డి, ఎ.ఇన్నారెడ్డి, వై.జోజిరెడ్డి, జి.సుమంత్‌రెడ్డి, బి.రామకృష్ణ, ఎం.రాజారెడ్డి, ఎం.చిన్న శౌర్రెడ్డి, కె.జోసఫ్‌రెడ్డి, జి. కస్పారెడ్డి, వి.కోటిరెడ్డి, ఓ.ఇన్నారెడ్డి, జె.రాజేష్‌రెడ్డి, వైఎఫ్ మర్రెడ్డి, ఎం.రాయపురెడ్డి తెలిపారు. న్యాయనిర్ణేతలుగా రాధాకృష్ణ, పి.సుబ్బారెడ్డి, శ్రీనివాసరావులు వ్యవహరించారు.
రెండు పళ్ల విభాగంలో ప్రథమస్థానంలో
నిలిచిన బాపట్ల జిల్లా ఎడ్లు


