నగరంపాలెం (గుంటూరు ఈస్ట్): రాష్ట్ర ప్రభుత్వం ఉగాది–26 పురస్కారాలను ప్రకటిస్తూ ఉత్తర్వులు జారీచేసింది. అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) గుంటూరు ఉమ్మడి జిల్లాకు ఒకటి ఉత్తమ, రెండు సేవా పతకాలు లభించాయి. ఉమ్మడి జిల్లా అదనపు ఎస్‌పీ మహేంద్ర మత్తేకు సేవా పతకం, హెడ్‌కానిస్టేబుల్ బి.శ్రీనివాసరావుకు ఉత్తమ సేవా పతకం, కానిస్టేబుల్ యు.సురేష్‌బాబు సేవా పతకానికి ఎంపికయ్యారు. ఏఎస్పీ మహేంద్ర మత్తే తొలుత గ్రేహాండ్స్, విశాఖపట్నం, పాడేరు, విజయవాడ జీఆర్పీ, విశాఖపట్నం అర్బ న్ ఇంటిలిజెన్స్, శ్రీకాకుళం జిల్లా డీఎస్పీగా, విశాఖ పట్నం సిటీ టాస్క్‌ఫోర్స్ ఏసీపీ గా విధులు నిర్వర్తించారు. 2023లో అదనపు ఎస్‌పీగా ఉద్యోగోన్నతి పొంది, ఏసీబీ ఉమ్మడి గుంటూరు జిల్లాకు బదిలీయ్యారు.


