నరసరావుపేట:పట్టణంలోని కుమ్మరబజార్‌లో ఆ వర్గీయులు ఏర్పాటుచేసిన తొలి తెలుగు మహిళ రామాయణం కవయిత్రి మొల్లమాంబ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి శుక్రవారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సభలో కవయిత్రి మొల్ల గొప్పతనం గురించి వివరించారు. సమీపంలోని మహాలక్షమ్మ చెట్టు వద్ద పూజలు చేశారు. ఇరువురిని కుమ్మరి సంఘ వర్గీయులు సత్కరించారు. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ నాయకులు మాజీ ఎంపీపీ మంగమ్మ, శాలివాహన సంఘ జిల్లా అధ్యక్షుడు తొర్లకొండ చిన అంజయ్య, ఇంటలెక్చువల్ ఫోర్ రాష్ట్ర కార్యదర్శి ఇయం.స్వామి, పట్టణ వర్కింగ్ అధ్యక్షులు అచ్చిశివకోటి, నాయకులు మోరా శ్రీనివాసరావు, షేక్ శిలార్, సంఘ నాయకులు పాల్గొన్నారు.
ఆలయ నిర్మాణానికి రూ.3.33లక్షలు విరాళం
నరసరావుపేటరూరల్: ఇస్సపాలెం మహంకాళీ అమ్మవారి ఆలయ నిర్మాణానికి ఇస్సపాలెం గ్రామానికి చెందిన గరికపాటి శ్రీనివాసరావు, రాజ్యలక్ష్మీ దంపతులు, సురేష్, సాయి శిరీష దంపతులు రూ.3.33,333 విరాళంగా అందజేశారు. ఈవో నలబోతు మాధవిదేవిని శుక్రవా రం కలిసి విరాళం నగదు అందించారు. కార్య క్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ బండ్లమూరి చంద్రశేఖర్, అర్చకులు కొత్తలంక కార్తికేయ శర్మ, నండూరి కాళీకృష్ణలు పాల్గొన్నారు.
చిదంబర రామలింగేశ్వర స్వామి వారికి సంప్రోక్షణ
మాచవరం:వేమవ రం గ్రామంలో అతి పురాతనమైన పార్వతి సమేత చిదంబర రామలింగేశ్వర స్వామి వారికి శుక్రవారం సంప్రోక్ష ణ కార్యక్రమం జానపాటి సీతారామశర్మ ఆధ్వర్యంలో వేద బ్రాహ్మణోత్తములు నిర్వహించారు ఆలయ పునః నిర్మాణలో భాగంలో దేవతామూర్తులను బాల ఆలయంలోకి మార్చి నిత్య ధూప దీప నైవే ద్యం నిర్వహించనున్నట్లు పూజారులు తెలిపా రు. సంప్రోక్షణ క్రతువుని పవిత్ర జలాలతో మంత్రోచ్ఛారణల నడుమ ఆలయం దేవతామూర్తులను మహా సంప్రోక్షణతో శుద్ధి చేసి మూలమూర్తికి దైవ శక్తిని పునరుద్ధరించడానికి గర్భగుడిలోని కలశాలకు ఉత్సవమూర్తుల దైవ శక్తి కోసం నిత్య ధూప దీప నైవేద్యం నిర్వ హిస్తామని తెలిపారు. నరసింహమూర్తి శర్మ భార్గవ్ రాకేష్ శర్మ, మాచవరం మండల దేవదాయ గ్రూప్ ఈవో సుబ్బారెడ్డి గ్రామపెద్దలు పాల్గొనిభక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు.
పద్మశాలి సంఘ జిల్లా
అధ్యక్షులుగా హనుమత్‌ప్రసాద్
నరసరావుపేట: పద్మశాలి సంఘం జిల్లా నూతన అధ్యక్షులుగా జొన్నాదుల హనుమత్ ప్రసాద్ (నరసరావుపేట) ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ప్రకాష్‌నగర్‌లో నిర్వహించిన సమావేశంలో ఈ ఎన్నిక జరిగింది. రాష్ట్ర అధ్యక్షులు జగ్గారపు శ్రీనివాసరావు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలుకోటి అంజిబాబు, గుంటూరు జిల్లా అధ్యక్షులు జంజనం వెంకటసాంబశివరావు హాజరయ్యారు. గౌరవాధ్యక్షులు జంజనం వెంకటేశ్వర్లు, నరసరావుపేట పద్మశాలి సంఘం సెక్రటరీ గుంటి వెంకటేశ్వరావు, కోశాధికారి చిన్నం రామాంజనేయులు పాల్గొన్నారు.


