దేవాలయ నిర్మాణానికి బిట్రా విరాళం
పెదకూరపాడు : లగడపాడు గ్రామంలో నూతనంగా నిర్మిస్తున్న భద్రావతి సమేత భావనా రుషి స్వామి దేవాలయానికి రథసప్తమి పండుగను పురస్కరించుకొని సత్తనపల్లికి చెందిన వైద్యులు బిట్రా నాగరాజు రూ.లక్ష విరాళంగా ఆదివారం అందించారు. ఈ సందర్భంగా నాగరాజు మాట్లాడుతూ గ్రామాల్లో ఆధ్యాత్మిక శోభను నెలకొల్పేందుకు తన వంతు సహాయ సహకారాలు అందిస్తానన్నారు. దేవాలయ కమిటీ చైర్మన్ అనుముల వెంకట్రావు, సభ్యులు పాపారావు, రామారావు, నాగేశ్వరరావు, బండారు నాగరాజు, తిరుపతిరావులు నాగరాజును సత్కరించారు.
తెనాలి: పట్టణ షరాఫ్‌బజారులోని భద్రావతి సమేత భావనాఋషిస్వామి కళ్యాణ మహోత్సవంలో భాగంగా రథసప్తమి పర్వదినమైన ఆదివారం వసంతోత్సవం జరిపారు. స్వామి అమ్మవార్లను సూర్యప్రభ వాహనంపై ఉంచి, పట్టణంలో ఊరేగిస్తూ వివిధ రంగులతో వసంతోత్సవం కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా జరిపించారు. పలు ప్రాంతాల్లో స్వామివారికి ప్రసాద నివేదనలు జరిపారు. పద్మశాలీయ సంఘీయులందరూ యజ్ఞంలో పాల్గొని పూర్ణాహుతి కార్యక్రమాన్ని తిలకించారు. ఈ కార్యక్రమంలో శ్రీ పద్మశాలీయ బహుత్తమ సంఘం పెద్ద శ్రేష్టులు జొన్నాదుల కృష్ణ సత్యనారాయణ, జొన్నాదుల కోటేశ్వరరావు, గౌరవాధ్యక్షులు జొన్నాదుల మహేష్, అధ్యక్షులు తిరువీధుల సాంబశివరావు, దేవాలయ కమిటీ చైర్మన్ చిన్నం హరిగోపాల్, ప్రధాన కార్యదర్శి పంచుమర్తి భాస్కర్, కమిటీ సభ్యులు జొన్నాదుల మదన్మోహన్, ఆకురాతి శ్రీనివాసరావు, తాడిపర్తి శ్రీనివాసరావు, గుంటి ధనలక్ష్మి, ఆలూరి శ్రీనివాసరావు, తిరువీధుల వీరగోపాల్, గుంటి వెంకట్ పాల్గొన్నారు.
రూ.18.43 లక్షల విలువైన సిగరెట్లు సీజ్
తెనాలిరూరల్: తెనాలిలో అక్రమంగా నిల్వ చేసిన సిగరెట్లను విజిలెన్స్, జీఎస్టీ అధికారులు గుర్తించి సీజ్ చేశారు. సుమారు రూ.18, 43,200 విలువైన ఎటువంటి బిల్లులు లేని సిగరెట్లను అధికారులు గుర్తించారు. పట్టణంలో ఆదివారం జీఎస్టీ, విజిలెన్స్ అధికారులు సంయుక్తంగా వివిధ గోడౌన్లపై దాడులు చేశారు. మార్కెట్ ప్రాంతంలోని అంజయ్య వీధిలో కౌతరపు నమ్మయ్య నిర్వహిస్తున్న గోడౌన్‌లో రూ. 6.40 లక్షల విలువైన బిల్లులు లేని సిగరెట్లు, అలానే నందులపేట దేవినేని వారి వీధిలో వేములపల్లి మురళీకృష్ణ, ఉయ్యూరు సుబ్బారావుగుప్తాలకు చెందిన రూ. 12,03,200 విలువ గల సిగరెట్లను గుర్తించి సీజ్ చేశారు. గోడౌన్‌ల నిర్వాహకులపై కేసులు నమోదు చేసి వన్ టౌన్, టూ టౌన్ పోలీసులకు అప్పగించారు.
దేవాలయ నిర్మాణానికి బిట్రా విరాళం
దేవాలయ నిర్మాణానికి బిట్రా విరాళం


