ఏపీటీఎఫ్ జిల్లా నూతన కార్యవర్గం
నరసరావుపేట ఈస్ట్: పల్నాడు జిల్లా ఏపీటీఎఫ్ అధ్యక్షునిగా కె.ఎస్.కె.షరీఫా, ప్రధాన కార్యదర్శిగా బాళ్ల శ్రీనివాసరావు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. పట్టణంలోని ప్రైవేటు పాఠశాలలో ఆదివారం నిర్వహించిన ఏపీటీఎఫ్ జిల్లా కౌన్సిల్ సమావేశంలో జిల్లా కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. జిల్లా ఉపాధ్యక్షులుగా కె.కృష్ణారావు, ఎస్‌కె.ఎండి.ఇబ్రహీం, టి.శ్రీనివాసరావు, సిహెచ్.శ్రీనివాసరావు, షాహినా సుల్తానా, కార్యదర్శులుగా దమ్మాటి శ్రీనివాసరావు, యు.శివానంద్‌కుమార్, బి.ప్రజామూర్తి, సాని శ్రీనివాసరావు, వి.హైందవకృష్ణ, మీసాల గోపి, రాష్ట్ర కౌన్సిలర్లుగా సయ్యద్ కరిముల్లా, వి.వి.రవికుమార్, బండి రమేష్‌బాబు, ఎస్‌ఎస్‌ఎన్ మూర్తి, ఆడిట్ కమిటీ కన్వీనర్‌గా జి.ఆంజనేయులు ఎన్నికయ్యారు. ఎన్నికల అధికారిగా రాష్ట్ర ఉపాధ్యక్షుడు పువ్వాడి వెంకటేశ్వర్లు, పరిశీలకునిగా ఈ.వి.రామారావు వ్యవహరించారు. కార్యక్రమంలో ఏపీటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు చెన్నుపాటి మంజుల, రాష్ట్ర కార్యదర్శి మక్కెన శ్రీనివాసరావు, గుంటూరుజిల్లా అధ్యక్ష్య, కార్యదర్శులు కె.బసవలింగారావు, మహమ్మద్ ఖాలీద్ పాల్గొన్నారు.
అధ్యక్షునిగా షరీఫా, కార్యదర్శిగా శ్రీనివాసరావు
ఏపీటీఎఫ్ జిల్లా నూతన కార్యవర్గం


