తెనాలి ఇన్‌చార్జి సబ్ కలెక్టర్‌గా శ్రీనివాస్
తెనాలి: తెనాలి ఇన్‌ఛార్జి సబ్‌కలెక్టర్‌గా ఎస్సీ కార్పొరేషన్ ఈడీ శ్రీనివాస్ బాధ్య తలు చేపట్టారు. తెనాలి సబ్‌కలెక్టర్ వి.సంజనా సింహ పదోన్నతిపై బదిలీపై వెళ్లిన విషయం తెలిసిందే. కొద్దిరోజుల క్రితమే ఆమె పల్నాడు జిల్లా జాయింట్ కలెక్టర్‌గా బాధ్యతు చేపట్టారు. దీనితో ఇన్‌ఛార్జి సబ్‌కలెక్టర్ డిప్యూటీ కలెక్టర్ హోదాలోని ఎస్సీ కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శ్రీనివాస్ శనివారం బాధ్యతలు స్వీకరించారు.
క్వారీ తిరునాళ్లపై సమీక్ష
స్థానిక సబ్‌కలెక్టర్ కార్యాలయంలో సోమవారం క్వారీలో గల శ్రీబాలకోటేశ్వరస్వామి తిరునాళ్ల ఏర్పాట్లపై డివిజన్‌స్థాయి కో–ఆర్డినేషన్ సమావేశం నిర్వహించారు. డివిజనులోని వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు, ఆలయ ఈవో హాజరయ్యారు. ఇన్‌చార్జి సబ్‌కలెక్టర్ శ్రీనివాస్ అధ్యక్షత వహించారు. ఫిబ్రవరి 15వ తేదీన మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా జరిగే తిరునాళ్లకు సంబంధించి తీసుకోవాల్సిన చర్యలు, ఏర్పాట్లపై చర్చించారు. మరోసారి పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్రకుమార్‌తో కో–ఆర్డినేషన్ సమావేశం జరుగుతుందని అధికారులు తెలిపారు.


