హోరాహోరీగా ఎడ్ల బలప్రదర్శన పోటీలు
రెంటచింతల: ఫిబ్రవరి 2వ తేదీన నిర్వహిస్తున్న స్థానిక కానుకమాత చర్చి 176వ తిరునాళ్ల మహోత్సవాన్ని పురష్కరించుకుని సోమవారం స్థానిక సెయింట్ జోసఫ్స్ ఉన్నత పాఠశాల క్రీడామైదానంలో నిర్వహిస్తున్న జాతీయస్థాయి ఒంగోలు జాతి ఎడ్ల బలప్రదర్శన పోటీలు హోరాహోరిగా జరిగాయి. టచ్ పండ్ల సైజ్ విభాగంలో జరిగిన ఈ ప్రదర్శనలో పల్నాడు జిల్లా అచ్చంపేట మండలం వేల్పూరు గ్రామానికి చెందిన శావల గోపికృష్ణ, నెల్లూరు జిల్లా సైదాపురం గ్రామానికి చెందిన ముక్కపాటి లింగయ్య చౌదరి కంబైన్డ్ గిత్తలు 4,200 అడుగుల దూరం లాగి ప్రథమ బహుమతి రూ. 40 వేలను కై వశం చేసుకున్నాయి. గుంటూరు జిల్లా తాడికొండ మండలం బండారుపల్లి గ్రామానికి చెందిన కాసుల ఆంజనేయులు గిత్తలు 4,122.10 అడుగుల దూరం లాగి రెండవ బహుమతి రూ.30 వేలను, ప్రకాశం జిల్లా దర్శి మండలం రాజంపల్లి గ్రామానికి చెందిన గొర్ల శివన్నారాయణకు చెందిన గిత్తలు 4,108.4 అడుగుల దూరం లాగి 3వ బహుమతి రూ.25 వేలను, పల్నాడు జిల్లా వినుకొండకు చెందిన డా. కాకాని వెంకట సురేంద్ర గిత్తలు 4,081.10 అడుగుల దూరంలాగి 4 వ బహుమతి రూ.20 వేలను, గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం కుంచనపల్లి గ్రామానికి చెందిన పులగం త్రిషగ్నా రెడ్డి, జెసితారెడ్డిలకు చెందిన గిత్తలు 3,970.2 అడుగుల దూరం లాగి 5 వ బహుమతి రూ. 16 వేలను గెలుచుకున్నాయి. ఇలా పదవస్థానం వరకు బహుమతులు ఇచ్చారు. మిగిలిన 17 జతలకు కూడ రూ. 4 వేల చొప్పున ప్రోత్సహక బహుమతులుగా అందచేసినట్లు కమిటీ సభ్యులు వైఎల్ మర్రెడ్డి, ఆదూరి ఇన్నారెడ్డి, జి.సుమంత్‌రెడ్డి, బి.రామకృష్ణ, ఎం.రాజారెడ్డి, ఎం. చిన్న శౌర్రెడ్డి, కె.జోసఫ్‌రెడ్డి, జి.కస్పారెడ్డి, వి.కోటిరెడ్డి, ఒ.ఇన్నారెడ్డి తెలిపారు.


