పల్నాడు
న్యూస్‌రీల్
భారీగా పెరిగిన కేంద్రాల నిర్వహణ వ్యయం ఇప్పటికీ 2022 ధరలకు అనుగుణంగానే బిల్లులు చెల్లింపు నేడు మూడు రెట్లు పెరిగిన నిత్యావసరాల ధరలు కేంద్రాల నిర్వహణ కష్టసాధ్యమంటున్న కార్యకర్తలు కేంద్రాల నిర్వీర్యం దిశగా చంద్రబాబు ప్రభుత్వం అడుగులు
2022లో అప్పటి వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి పెంచిన ధరలనే ఇప్పటికీ కొనసాగిస్తూ పిల్లలకు పోషకాహారాన్ని అందిస్తున్నారు.దీంతో పిల్లలకు సరైన పోషకాహారం అందించలేక అంగన్‌వాడీ కార్యకర్తలు అవస్థలు ఎదుర్కొంటున్నారు.
2022 ఫిబ్రవరి నెలలో అప్పటి వైఎస్సార్ సీపీ ప్రభుత్వం పెంచిన ధరల ఆధారంగానే నేటికీ మధ్యాహ్న భోజన బిల్లులు చెల్లిస్తూ ఉండడంతో గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు పౌష్టికాహారం అందించేందుకు అంగన్‌వాడీ కార్యకర్తలు సతమతమవుతున్నారు.
ప్రీస్కూల్ పిల్లల ఆహారం కోసం కూరగాయలు, ఆకుకూరలు, పసుపు, చింతపండు, కారం, పోపులు తదితర సామగ్రిని ఎప్పటికప్పుడు సిద్ధం చేసుకోవాలి. వీటి కొనుగోలుకు రోజుకు ఒక చిన్నారికి వారానికి రూ.1.50 చొప్పున ప్రభుత్వం చెల్లిస్తుంది. పెరిగిన ధరలకు ఇవి ఏమాత్రం సరిపోవడం లేదని అంగన్‌వాడీ కార్యకర్తలు వాపోతున్నారు.
గ్యాస్ సిలిండర్‌కు నెలకు రూ.450 చొప్పున ఇస్తున్నారు. ప్రస్తుతం సిలిండర్ ధర రూ. 950 కు కొనుగోలు చేస్తున్నారు. 2022తో పోల్చితే నేడు నిత్యవసరాల ధరలు మూడు రెట్లు పెరిగాయి. అలాగే గ్యాస్ ధర కూడా సుమారు రూ. 500 వరకు పెరిగింది.
మెనూ ప్రకారం పౌష్టికాహారం అందించేందుకు అంగన్‌వాడీ సిబ్బంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అంగన్‌వాడీ కేంద్రాలను పరిశుభ్రంగా ఉంచేందుకు సబ్బులు, చీపుర్లు, చాపలు, తదితర సామగ్రి కొనుగోలుకు ప్రభుత్వం నిధులు అందజేయాలి.
చంద్రబాబు సర్కార్ నిర్వహణ ఖర్చులను ఇవ్వకపోవడంతో కార్యకర్తలు చేతి చమురు వదిలించుకొని వీటిని కొనుగోలు చేస్తున్నారు. ఇప్పటికై నా ప్రభుత్వం స్పందించి ప్రస్తుత ధరల ప్రకారం అంగన్‌వాడీ కేంద్రాల నిర్వహణకు బిల్లులు పెంచాలని అంగన్‌వాడీ కార్యకర్తలు కోరుతున్నారు.
మంగళవారం శ్రీ 3 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2026
అంగన్‌వాడీ కేంద్రాలపై టీడీపీ సర్కార్ తీవ్ర నిర్లక్ష్యం
తెనాలి: తెనాలి మార్కెట్ యార్డులో సోమవారం క్వింటా నిమ్మకాయలు కనిష్ట ధర రూ.3400, గరిష్ట ధర రూ.4800, మోడల్ ధర రూ.4200 వరకు పలికింది.
అచ్చంపేట: పులిచింతల ప్రాజెక్టు నుంచి దిగువకు 2900 క్యూసెక్కులు వదులుతున్నారు. ప్రస్తుతం ప్రాజెక్టు నిల్వ 54.90 టీఎంసీలు.
7
సత్తెనపల్లి: మాతా శిశు సంరక్షణే లక్ష్యంగా నడుస్తున్న అంగన్‌వాడీ కేంద్రాలు చంద్రబాబు సర్కార్‌లో డీలా పడుతున్నాయనే విమర్శలు వినిపిస్తున్నాయి. గర్భిణులు, బాలింతలు, పిల్లల పౌష్టికాహారాన్ని కేటాయించాల్సిన నిధుల పెంపు విషయంలో చర్యలు తీసుకోక పోవడంతో వీటి ఆశయం నెరవేరడం లేదు. బాల్యం నుంచే చిన్నారులకు చదువు వైపు ఆసక్తి కలిగించేందుకు బాల్యంలో సరైన పోషకాహారం అందించేందుకు ఉద్దేశించి ప్రవేశపెట్టిన అంగన్‌వాడీ కేంద్రాల్లో చదువుతున్న చిన్నారులకు ప్రస్తుతం టీడీపీ ప్రభుత్వ పాలనలో పోషకాహారం భారంగా మారింది. టీడీపీ ప్రభుత్వం అంగన్‌వాడీ కేంద్రాల్లో చదువుతున్న చిన్నారుల ఆరోగ్యం పట్ల నిర్లక్ష్య ధోరణతో వ్యవహరిస్తుందన్న ఆరోపణలు జోరుగా వినిపిస్తున్నాయి.
నిధులు పెంచకపోవడంతో...
అంగన్‌వాడీ కేంద్రాల నిర్వహణ కార్యకర్తలకు భారంగా మారింది. నిత్యావసరాలు, కూరగాయల ధరలు అమాంతం పెరిగిపోయాయి. అందుకు తగ్గట్టు చంద్రబాబు సర్కార్ నిధులు కేటాయించలేదు.
రోజువారీ మెనూ ఇలా...
సోమవారం – దోసకాయ పప్పు
మంగళ – టమాటా పప్పు
బుధ – ఆకుకూర పప్పు
గురు – కూరగాయలతో సాంబారు
శుక్ర – బీరకాయ లేదా సొరకాయ పప్పు
శని – వెజిటబుల్ బాత్ రైస్
జిల్లా సమాచారం
జిల్లాలో ఐసీడీఎస్ ప్రాజెక్టులు : 09
అంగన్‌వాడీ కేంద్రాల సంఖ్య : 2,031
గర్భిణులు : 8,987
బాలింతలు : 10,073
ఆరేళ్లలోపు చిన్నారులు : 1,02,039
పల్నాడు
పల్నాడు
పల్నాడు
పల్నాడు
పల్నాడు
పల్నాడు
పల్నాడు


