మేజర్‌ కాలువలో పడి లస్కర్‌ మృతి | - | Sakshi
Sakshi News home page

మేజర్‌ కాలువలో పడి లస్కర్‌ మృతి

Jan 28 2026 7:16 AM | Updated on Jan 28 2026 7:16 AM

మేజర్

మేజర్‌ కాలువలో పడి లస్కర్‌ మృతి

మేజర్‌ కాలువలో పడి లస్కర్‌ మృతి గంజాయి విక్రయిస్తున్న మహిళలకు జైలు సార్వత్రిక సమ్మె నోటీసు అందజేత ఎంఈఓ కార్యాలయాల్లో సిబ్బంది లేక ఇబ్బందులు

రొంపిచర్ల: మేజర్‌ కాలువలో పడి లస్కర్‌ మృతి చెందిన సంఘటన మంగళవారం మండలంలోని మాచవరం మేజర్‌ వద్ద చోటుచేసుకుంది. సంతగుడిపాడు గ్రామానికి చెందిన ఎనుముల శ్రీనివాసరెడి (55) ఎన్‌ఎస్‌పీ కెనాల్స్‌లో లస్కర్‌గా పనిచేస్తున్నాడు. డ్యూటీలో భాగంగా మాచవరం మేజర్‌ కాలువపై డ్రాప్‌ వద్ద సాగునీటిని లెవల్స్‌ పరిశీలిస్తున్నాడు. ఇంతలో తూలుడు వచ్చి కాలువలో పడిపోయాడు. నీటిలో మునిగిన శ్రీనివాసరెడ్డి బయటకు రాలేకపోయాడు. అక్కడే సమీపంలో ఉన్న రైతులు గమనించి వెంటనే శ్రీనివాసరెడ్డిని కాలువ నుంచి బయటకు తీసి నరసరావుపేట వైద్యశాలకు తరలిస్తుండగా మార్గంమధ్యలోనే మృతి చెందాడు. సమాచారం తెలుసుకున్న రొంపిచర్ల ఎస్‌ఐ లోకేశ్వరరావు సంఘటన స్థలాన్ని చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నరసరావుపేట ఏరియా వైద్యశాలకు తరలించారు. మృతుడు బంధువులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.

గుంటూరు లీగల్‌: గంజాయి విక్రయిస్తున్న మహిళలకు నాలుగు సంవత్సరాల జైలు శిక్ష, రూ.వెయ్యి జరిమానా విధిస్తూ న్యాయమూర్తి తీర్పు వెలువరించారు. ప్రాసిక్యూషన్‌ కథనం ప్రకారం... పల్నాడు జిల్లా చిలకలూరిపేట ప్రొహిబిషన్‌ అండ్‌ ఎకై ్సజ్‌ అధికారులు గంజాయి విక్రయిస్తూ పట్టుబడిన మహిళలపై నమోదు చేశారు. తూర్పుగోదావరి జిల్లా ఏలూరు సత్రంపాడు గ్రామానికి చెందిన ఇద్దరు మహిళలు చిలకలూరిపేట పరిసర ప్రాంతాల్లో గంజాయి విక్రయిస్తున్నారన్న సమాచారంతో ఎకై ్సజ్‌ పోలీసులు దాడి చేసి పట్టుకున్నారు. వలుముల రమణ, గాలం గిరిజలను అరెస్టు చేసి కోర్టులో హాజరు పరిచారు. నిందితులపై నేరం రుజువు కావడంతో ఒక్కొక్కరికి నాలుగు సంవత్సరాలు జైలు శిక్ష, రూ. వెయ్యి జరిమానా విధిస్తూ గుంటూరు జిల్లా ఒకటో అదనపు జిల్లా సెషన్స్‌ కోర్టు న్యాయమూర్తి వి.ఎ.ఎల్‌. సత్యవతి తీర్పు చెప్పారు. రూ.వెయ్యి కట్టని పక్షంలో 15 రోజుల సాధారణ జైలు శిక్ష విధించారు. కేసులో ప్రాసిక్యూషన్‌ అడిషనల్‌ పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌. వై.సీహెచ్‌.అశోకవాణి వాదనలు వినిపించారు.

లక్ష్మీపురం: గుంటూరు, అమరావతి రోడ్‌లోని జంపని టవర్స్‌లో సీ్త్ర శిశు సంక్షేమ శాఖ కమిషనర్‌ వేణుగోపాల్‌ రెడ్డిని అంగన్‌వాడీ టీచర్లు, హెల్పర్లు, మినీ టీచర్లు కలిసి సార్వత్రిక సమ్మె నోటీసు మంగళవారం అందజేశారు. ఫిబ్రవరి నెల 12న జరిగే దేశవ్యాప్త సార్వత్రిక ఒక్కరోజు సమ్మెలో అంగన్‌వాడీ టీచర్లు హెల్పర్లు, మినీ టీచర్లు, పాల్గొంటున్నారని తెలిపారు. వినతి పత్రం అందజేసిన వారిలో శారమ్మ, రమాదేవి, కె.సుబ్బారావమ్మ, జ్యోతి గంగాదేవి తదితరులు ఉన్నారు.

గుంటూరు ఎడ్యుకేషన్‌: వివిధ మండలాల్లోని ఎంఈవో కార్యాలయాల్లో తగినంత సిబ్బంది లేకపోవడంతో ఉపాధ్యాయులు పలు సమస్యలను ఎదుర్కొంటున్నారని యూటీఎఫ్‌ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు యు.రాజశేఖర్‌రావు, ఎం.కళాధర్‌ పేర్కొన్నారు. ఈమేరకు మంగళవారం జిల్లా విద్యాశాఖాధికారి షేక్‌ సలీమ్‌బాషాను డీఈవో కార్యాలయంలో కలిసి సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. ఎంఈవో కార్యాలయాల్లో ఉపాధ్యాయుల సర్వీసు రిజిస్టర్లు అప్‌డేట్‌ కాకుండా ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉంటున్నాయని తెలిపారు. క్లోజర్‌లు, బకాయిలు, మెడికల్‌ బిల్లులను చేయాల్సి ఉన్నా సిబ్బంది లేక చేయడం లేదని, సంబంధిత బిల్లులను ఉపాధ్యాయులతో చేయించుకోవాలని చెబుతున్నారని అన్నారు. కొల్లిపర, తుళ్లూరు మండలాల్లో సిబ్బంది కొరత తీర్చాలన్నారు. డీఈవోని కలసిన వారిలో యూటీఎఫ్‌ నాయకులు జి.వెంకటేశ్వర్లు, కార్యదర్శులు సీహెచ్‌ ఆదినారాయణ, కె.కేదార్‌నాధ్‌, కాలేషావలి ఉన్నారు.

మేజర్‌ కాలువలో పడి లస్కర్‌ మృతి  1
1/2

మేజర్‌ కాలువలో పడి లస్కర్‌ మృతి

మేజర్‌ కాలువలో పడి లస్కర్‌ మృతి  2
2/2

మేజర్‌ కాలువలో పడి లస్కర్‌ మృతి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement