రిస్క్‌ తీసుకోం..! | - | Sakshi
Sakshi News home page

రిస్క్‌ తీసుకోం..!

Jan 30 2026 6:47 AM | Updated on Jan 30 2026 6:47 AM

రిస్క

రిస్క్‌ తీసుకోం..!

విచారణ జరిపి చర్యలు

గర్భిణులకు గంపెడు కష్టాలు

డెలివరీ చేసేందుకు వైద్యుల వెనకడుగు

హై రిస్క్‌ పేరుతో గుంటూరు తరలింపు

నరసరావుపేటలోని ఏరియా వైద్యశాలలో

భయంతో చేతులెత్తేస్తున్న వైద్యాధికారులు

ప్రశ్నించని ఉన్నతాధికారులు

బాలింత మృతితో వైద్యుల్లో వణుకు

పురిటి నొప్పులతో నిండు శూలాలు విలవిలలాడుతుంటే భయపడొద్దని ధైర్యం చెప్పాల్సిన వైద్యుల చేయి.. నో రిస్క్‌ అంటూ వెనక్కు లాగుతోంది. అమ్మా.. ఊరుకో డాక్టర్‌ దగ్గరకొచ్చామని నిండు గర్భిణికి ధైర్యం చెప్పేలోగా.. మా వల్ల కాదు.. పెద్దాస్పత్రికి వెళ్లండంటూ ప్రభుత్వాస్పత్రి గెంటేస్తోంది. వైద్యుల నిర్లక్ష్యం నిండు గర్భిణులకు శాపంగా మారుతోంది. కేవలం నెలల కాలంలో నరసరావుపేట ఏరియా వైద్యశాలలో పడిపోయిన డెలివరీల సంఖ్య ప్రభుత్వాధికారుల పర్యవేక్షణ లోపాన్ని కళ్లకు కడుతోంది.

డెలివరీల సంఖ్య తగ్గిన మాట వాస్తవమే. అయితే అందులో వైద్యుల నిర్లక్ష్యం ఉంటే సహించేది లేదు. గుంటూరు ప్రభుత్వ వైద్యశాలకు రిఫర్‌ చేస్తున్న కేసులపై దృష్టి పెడతా. గర్భిణులకు అందించే వైద్యసేవల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తీసుకుంటాం.

– డాక్టర్‌ సురేష్‌ కుమార్‌, సూపరింటెండెంట్‌, ఏరియా వైద్యశాల, నరసరావుపేట

నరసరావుపేట టౌన్‌: నవమాసాలు మోసి బిడ్డను కని ఆనందించాల్సిన గర్భిణులను కష్టాలు వెంటాడుతున్నాయి. ఒకవైపు పురిటినొప్పితో ప్రాణాలు అరచేత పెట్టుకొని ప్రభుత్వ వైద్యశాలకు వస్తున్న గర్భిణులకు గడపలోనే వైద్యసేవల నిరాకరణ జరుగుతోంది. ప్రధానంగా పల్నాడు జిల్లా కేంద్రం నరసరావుపేట ఏరియా వైద్యశాలలో గర్భిణుల కష్టాలు అన్నీఇన్నీ కావు. ఇక మారుమూల ప్రాంతాల పరిస్థితి మరింత దయనీయంగా మారింది. జిల్లాలోనే పెద్దాసుపత్రిగా పేరొందిన ఏరియా వైద్యశాలకు పల్నాడు జిల్లాలోని ప్రజలతో పాటు బాపట్ల, ప్రకాశం జిల్లాల నుంచి వైద్యసేవల కోసం గర్భిణులు వస్తుంటారు. ప్రతిరోజు సుమారు 100 వరకు ఓపీ నమోదు అవుతుండగా.. నెలకు 300 పైగా ప్రసవాలు జరుగుతున్నాయి. ఇక్కడ ఆనుభవజ్ఞులైన వైద్యులు, నాణ్యమైన వైద్యం అందుతాయన్న నమ్మకంతో సుదూర ప్రాంతాల నుంచి పేదలు వస్తుంటారు. అయితే ఇదంతా ఒకప్పటి మాట. ప్రస్తుతం ఓపీ, ప్రసవాల సంఖ్య సగానికి పడిపోయింది. ఓపీ 60 వరకు నమోదు అవుతుండగా, నెలకు డెలివరీలు 140 వరకు గత రెండు నెలలుగా జరుగుతుండటం వైద్యసేవల్లో లోపాన్ని చాటుతుంది.

రిస్క్‌ చేయని వైద్యులు..

ఒకప్పుడు వైద్యశాలకు వచ్చిన హైరిస్క్‌ గర్భిణి కేసులను చాలెంజ్‌గా తీసుకొని తమ అనుభవంతో వైద్యులు, సిబ్బంది శ్రమించి ప్రసవాలు చేసేవారు. అయితే ప్రస్తుతం హైరిస్క్‌ కేసుల జోలికి వెళ్లటం లేదు. డెలివరీలలో గుంటూరు ప్రభుత్వ వైద్యశాల తర్వాత నరసరావుపేట ఏరియా వైద్యశాల రెండు లేక మూడవ స్థానంలో ఉంటుంది. అలాంటి చరిత్ర ఉన్న ఏరియా వైద్యశాల్లో ఉన్నతాధికారుల పర్యవేక్షణ లోపానికి తోడు వైద్యుల నిర్లక్ష్యం ప్రజారోగ్యానికి పెను ప్రమాదంగా మారింది.

సిఫార్సుతో ప్రాణ నష్టం..

మాచర్లకు చెందిన గర్భిణి పురిటి నొప్పులతో ఈ నెల 17న 108లో నరసరావుపేట ఏరియా వైద్యశాలకు వచ్చింది. బిడ్డ అడ్డం తిరిగి ఉండటాన్ని గమనించిన ఇక్కడి వైద్యులు ప్రథమ చికిత్స కూడా అందించకుండా గుంటూరు ప్రభుత్వ వైద్యశాలకు రిఫర్‌ చేశారు. అక్కడ శస్త్రచికిత్స చేసి బిడ్డను బయటకు తీశారు. అనంతరం బాలింత మృతి చెందింది. నరసరావుపేటలో సకాలంలో వైద్యం అంది ఉంటే ఆమె మృతి చెంది ఉండేది కాదని మృతురాలి బంధువులు ఫిర్యాదు చేశారు. దీంతో ఏపీవీపీ జాయింట్‌ కమిషనర్‌ ఈ వ్యవహారంపై విచారణ చేపట్టారు.

సగానికి పడిపోయిన ప్రసవాల సంఖ్య

నరసరావుపేట ఏరియా వైద్యశాలలో బాలింత మృతితో వైద్యుల్లో భయం ఏర్పడింది. హైరిస్క్‌ కేసుల జోలికి వెళ్లేందుకు వైద్యులు ధైర్యం చేయటం లేదు. వచ్చిన కేసులను గుంటూరు ప్రభుత్వ వైద్యశాలకు సిఫార్స్‌ చేసి చేతులు దులుపుకొంటున్నారు. ప్రసవం కోసం 2 నెలల క్రితం మాచర్ల నియోజకవర్గం పాల్వాయి గేటుకు చెందిన సాగరమ్మ వచ్చి బిడ్డకు జన్మనిచ్చిన అనంతరం మృతి చెందింది. గర్భిణికి రక్తం ఎక్కించే విషయంలో ఒక గ్రూప్‌నకు బదులు మరో గ్రూప్‌ ఎక్కించటంతో ఆమె మృతి చెందింది. దీంతో బంధువులు ఆందోళన చేశారు. ఈ వ్యవహారాన్ని రూ.5 లక్షలు ఇచ్చి సెటిల్‌ చేసుకున్నారు. అయితే ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లటంతో కమిటీని ఏర్పాటు చేసి విచారణ చేశారు.

రిస్క్‌ తీసుకోం..! 1
1/1

రిస్క్‌ తీసుకోం..!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement