బ్యాంకు ఉద్యోగుల ఆందోళన
వారానికి ఐదురోజుల పని దినాలు అమలు చేయాలని డిమాండ్
నరసరావుపేట: వారానికి ఐదు రోజుల పనిదినాలు అమలు చేయాలంటూ బ్యాంకు ఉద్యోగులు డిమాండ్ చేశారు. ఈ మేరకు మంగళవారం యూనియన్ బ్యాంక్స్ అసోసియేషన్(ఐబీఎ), యూనియన్ ఫోరం ఆఫ్ బ్యాంకు యూనియన్స్(యూఎఫ్‌బీయు), నరసరావుపేట లోకల్ బ్రాంచెస్‌కు చెందిన బ్యాంకు ఉద్యోగులు దేశవ్యాప్త సమ్మెలో భాగంగా అరండల్‌పేటలోని యూనియన్ బ్యాంకు ఆఫ్ ఇండియా ఎదుట నిరసన వ్యక్తం చేశారు. బ్యాంకు కార్యకలాపాలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఎస్‌బీఐ స్టాఫ్ యూనియన్ నరసరావుపేట రీజనల్ సెక్రటరీ పీఎంయూ రామకృష్ణ మాట్లాడుతూ డిమాండ్ల సాధన కోసం తొమ్మిది బ్యాంకు ఉద్యోగుల సంఘాలు దేశవ్యాప్త సమ్మెకు పిలుపునిచ్చాయ న్నారు. వారంలో ఐదురోజుల పనిదినాలు అమలు చేయటానికి ప్రభుత్వ అనుమతి కోరుతున్నామన్నారు. ప్రస్తుతం రెండు, నాలుగు శనివారాల్లోనే సెలవులు అమలౌతున్నాయన్నారు. మిగిలిన శనివారాలను సైతం సెలవులుగా ప్రకటించాలని కోరగా స్పందన లేకపోవటంతో 2025 మార్చి 24, 25 రెండురోజుల పాటు సమ్మెకు పిలుపుఇవ్వటం జరిగిందన్నారు. ప్రభుత్వం కోరిన మీదట సమ్మె వాయిదా వేశామన్నారు. ఫైనాన్షియల్ రంగంలో అన్నీ సంస్థలు వారానికి కేవలం ఐదురోజులే పనిదినాలుగా అమలు చేస్తున్నందున యూఎఫ్‌బీయు మళ్లీ సమ్మెకు పిలుపు ఇచ్చిందన్నారు. కార్యక్రమంలో ఏఐబీఓసీ రీజనల్ సెక్రటరీ రాముడు, నరసరావుపేట రీజియన్ ఆఫీసర్స్ అసోసియేషన్ రీజినల్ సెక్రటరీ బి.చిన్నపరెడ్డి, ఎన్‌సీబీసీ రీజినల్ సెక్రట రీ బి.కుమార్‌నాయక్, సత్తెనపల్లి, నరసరావుపేట, పిడుగురాళ్ల, నకరికల్లు, కారుమంచి, బెల్లంకొండ, క్రోసూరు, అచ్చంపేట, మండలా ప్రభు త్వ రంగ బ్యాంకు ఉద్యోగులు పాల్గొన్నారు.


