ఉత్తమ సేవకు పురస్కారాలు | - | Sakshi
Sakshi News home page

ఉత్తమ సేవకు పురస్కారాలు

Jan 27 2026 7:48 AM | Updated on Jan 27 2026 7:48 AM

ఉత్తమ

ఉత్తమ సేవకు పురస్కారాలు

పోలీసు కార్యాలయంలో గణతంత్ర వేడుకలు

లారీ ఢీకొని వ్యక్తి మృతి

షేక్‌ మహబూబ్‌ సుభాని, ఉప విద్యాశాఖాధికారి, నరసరావుపేట

ఆర్‌.వెంకటేశ్వరరావు, గ్రేడ్‌–2 ఈఓ, నరసరావుపేట

ఎం.సురేష్‌బాబు, ఏఎంవీఐ, నరసరావుపేట

వడ్డెర్ల అభివృద్ధికి చేయూతనివ్వండి

సత్తెనపల్లి: వడ్డెర్ల అభివృద్ధికి చేయూతనివ్వాలని వడ్డెర ప్రజాగళం రాష్ట్ర అధ్యక్షుడు ఇడగొట్టు నాగేశ్వరరావు అన్నారు. సత్తెనపల్లి వడ్డెర కాలనీలో సోమవారం ఆయన పర్యటించి వడ్డెర్ల ఆర్థిక, సామాజిక, రాజకీయ స్థితిగతులను స్థానిక వడ్డెరలను కలిసి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ నేటికీ 90 మంది వడ్డెర్లు బేల్దారి పని చేసుకుంటూ, రిక్షాలు తొక్కుకుంటూ దీన స్థితిలో కొనసాగుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం అందిస్తున్న సబ్సిడీ లోన్లు, రాయితీలు తెలియడం లేదని, ఎలా తెచ్చుకోవాలని తనను నేటికీ అడుగుతున్నారన్నారు. ఇప్పటికీ రెక్కాడితే కాని డొక్కాడని స్థితిలో వడ్డెర్లు కొనసాగుతున్నారంటే ఈ ప్రభుత్వాల వైఫల్యమేనన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 40 లక్షల ఓట్లు కలిగిన వడ్డెర్లను ఓటు బ్యాంకుగా వాడుకుంటున్నారే తప్ప వారి విద్యకు గాని, సామాజిక అభివృద్ధికి గాని, ఆర్థిక అభివృద్ధికి గానీ ప్రభుత్వాలు తోడ్పాటు ఇవ్వడం లేదని వాపోయారు. వడ్డెర్లలో చాలామందికి పెన్షన్లు కూడా అందడం లేదన్నారు. వడ్డెర్లు తమ పిల్లలను బాగా చదివించి మంచి ఉన్నత స్థాయికి తీసుకువెళ్లాలన్నారు. సమావేశంలో గుంటూరు జిల్లా మేడికొండూరు కోపరేటివ్‌ సొసైటీ ప్రెసిడెంట్‌ సంజీవరావు, వడ్డెర సంఘ నాయకులు ఒంటి పులి వీరరాజు, పసుపులేటి బాలయ్య, బురుసు అంకేశ్వరరావు, ప్రసాద్‌, శ్రీకాంత్‌, శ్రీను పాల్గొన్నారు.

బాలికపై లైంగిక దాడి

నిందితుడిపై పోక్సో కేసు నమోదు

వినుకొండ: బాలికపై లైంగిక దాడికి పాల్పడిన నిందితుడిపై పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారు. వినుకొండ సీఐ ప్రభాకరరావు తెలిపిన వివరాల ప్రకారం.. వినుకొండకు చెందిన ఓ మహిళ అదే ప్రాంతానికి చెందిన షేక్‌ బాజీతో సహజీవనం చేస్తుంది. తల్లిలేని సమయంలో ఆమె కుమార్తైపె బాజీ లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈనేపథ్యంలో మహిళ బంధువులు బాజీపై దాడి చేసి పోలీసులకు అప్పగించారు. పోలీసులు నిందితుడిపై పోక్సో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

77వ గణతంత్ర వేడుకలను పురస్కరించుకుని జిల్లాలో ఉత్తమ సేవలు అందించిన అధికారులు, సిబ్బందికి జిల్లా కలెక్టర్‌ కృతికశుక్లా సేవా పురస్కారాలు అందజేశారు. పోలీసు పరేడ్‌ గ్రౌండ్‌లో సోమవారం నిర్వహించిన కార్యక్రమంలో జిల్లా ఎస్పీ బి.కృష్ణారావు, జాయింట్‌ కలెక్టర్‌ సంజనా సింహా, డీఎఫ్‌ఓ కృష్ణప్రియలు పాల్గొన్నారు.

– నరసరావుపేట రూరల్‌

వడ్డెర ప్రజాగళం రాష్ట్ర అధ్యక్షుడు ఇడగొట్టు నాగేశ్వరరావు

నరసరావుపేట రూరల్‌: 77వ గణతంత్ర దినోత్సవాన్ని జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం ఘనంగా నిర్వహించారు. జిల్లా ఎస్పీ బి.కృష్ణారావు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి గౌరవ వందనం స్వీకరించారు. అదనపు ఎస్పీ(అడ్మిన్‌) జేవీ సంతోష్‌, ఏఆర్‌ అదనపు ఎస్పీ వి.సత్తిరాజు, ఏఆర్‌ డీఎస్పీ గాంధీరెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు.

పిడుగురాళ్ల: స్కూటీని లారీ ఢీకొనటంతో వ్యక్తి మృతి చెందిన సంఘటన పట్టణ సమీపంలోని కొండమోడు జంక్షన్‌ వద్ద సోమవారం జరిగింది. సంఘటనకు సంబంధించి పట్టణ సీఐ శ్రీరాం వెంకట్రావు తెలిపిన వివరాల మేరకు... రెంటాల గ్రామానికి చెందిన ఫరీద్‌(60) తన బంధువైన సుందరయ్య కాలనీకి చెందిన మహిళను స్కూటీపై ఎక్కించుకొని వస్తుండగా కొండమోడు జంక్షన్‌ వద్ద రోడ్డు దాటుతుండగా ఐచర్‌ లారీ స్కూటీని ఢీకొంది. ఈ ప్రమాదంలో ఫరీద్‌ రోడ్డుపై పడటంతో తలకు బలమైన గాయమై అక్కడిక్కడే మృతి చెందాడు. మృతుడి దగ్గరి బంధువైన మహిళకు తలకు గాయం కావటంతో పట్టణంలోని ప్రైవేటు వైద్యశాలలోచికిత్స పొందుతున్నట్లు తెలిపారు. సంఘటన స్థలాన్ని పరిశీలించిన సీఐ శ్రీరాం వెంకట్రావు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

ఉత్తమ సేవకు పురస్కారాలు 1
1/4

ఉత్తమ సేవకు పురస్కారాలు

ఉత్తమ సేవకు పురస్కారాలు 2
2/4

ఉత్తమ సేవకు పురస్కారాలు

ఉత్తమ సేవకు పురస్కారాలు 3
3/4

ఉత్తమ సేవకు పురస్కారాలు

ఉత్తమ సేవకు పురస్కారాలు 4
4/4

ఉత్తమ సేవకు పురస్కారాలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement