లలితాంబకు కుంకుమ పూజలు | - | Sakshi
Sakshi News home page

లలితాంబకు కుంకుమ పూజలు

Feb 2 2026 7:49 AM | Updated on Feb 2 2026 7:49 AM

లలితా

లలితాంబకు కుంకుమ పూజలు

లలితాంబకు కుంకుమ పూజలు భక్తి శ్రద్ధలతో గాయత్రీ మహాయజ్ఞం కనుల పండువగా ఆదికేశవస్వామి గరుడ సేవ వైభవంగా సత్యదేవుని రథోత్సవం

మాచర్ల: స్థానిక సాయిబాబా ఆలయలోని లలితాంబ అమ్మవారి 9వ వార్షికోత్సవ కార్యక్రమం ఆదివారం జరిగింది. మహిళలు కుంకుమ పూజలు జరిపారు.

పొన్నూరు: అఖిల విశ్వ గాయత్రీ పరివార్‌ పొన్నూరు శాఖ ఆధ్వర్యంలో స్థానిక సాక్షి భావనారాయణ స్వామి దేవాలయ ప్రాంగణంలో ఆదివారం 24 కుండముల గాయత్రీ మహాయజ్ఞం నిర్వహించారు. గోపూజతో కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం గాయత్రీ మహా యజ్ఞాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. కార్యక్రమంలో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ సందర్భంగా అఖిల గాయత్రి పరివార్‌ సంఘ ప్రధాన్‌ డీవీఆర్‌ మూర్తి మాట్లాడుతూ ఆధ్యాత్మికతను కులమతాలకతీతంగా విశ్వవ్యాప్తి చేయడమే గాయత్రి పరివార్‌ ముఖ్య లక్ష్యమని చెప్పారు. గాయత్రి మహామంత్రం జపిస్తే గాయత్రీ మాత అనుగ్రహాన్ని పొందవచ్చని చెప్పారు. పరివార్‌ సభ్యులు దమ్మాల వెంకటేశ్వర్లు, పులిపాటి శ్రీనివాసరావు, పులిపాటి భవాని శంకర్‌, నారాకోడూరు గాయత్రి పీఠం నిర్వాహకులు చుండూరు వెంకట చలపతిరావు తదితరులు పాల్గొన్నారు.

చేబ్రోలు: చారిత్రక ప్రసిద్ధి చెందిన చేబ్రోలులోని భూ నీలా సమేత ఆదికేశవ స్వామి దేవస్థానంలో ఆదివారం రాత్రి పున్నమి గరుడ సేవ కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. ఆలయ ప్రధాన అర్చకులు ఫణిహారం శ్రీధర్‌ ఆధ్వర్యంలో వివిధ కార్యక్రమాలు జరిగాయి. మాఘపౌర్ణమి సందర్భంగా నిర్వహించిన గరుడ సేవ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఆదికేశవ స్వామికి ప్రత్యేక పూజలు, విశేష కార్యక్రమాలు నిర్వహించారు. స్వామి వారి గ్రామోత్సవం కనుల పండువగా జరిగింది.

నగరంపాలెం(గుంటూరు వెస్ట్‌) : స్థానిక పట్టాభిపురం సత్యనారాయణస్వామి ఆలయ 49వ వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆదివారం రమాసమేత సత్యనారాయణ స్వామి రథోత్సవం వైభవంగా నిర్వహించారు. మూల విరాట్‌కు విశేష అభిషేకాలు, అర్చనలు, అలంకరణ జరగ్గా, ఆంజనేయస్వామికి మన్య సూక్తంతో అభిషేకం, సిందూరార్చన చేపట్టారు. ప్రత్యేకంగా అలంకరించిన వాహనంపై రమా సమేత సత్యనారాయణస్వామి ఉత్సవమూర్తులకు రథోత్సవం పురవీధుల్లో నిర్వహించారు. మంగళ వాయిద్యాలు, నామ సంకీర్తన బృందాలు, దేవత వేషధారణలో కళాకారులు, విద్యుత్‌ దీప కాంతుల నడుమ నగరోత్సవం నిర్వహించారు. అనంతరం స్వామికి ఊంజల్‌ సేవ చేపట్టారు. ప్రముఖ సంగీత విధ్వంసరాలు శ్రోతాస్విని (బెంగళూరు) నిర్వహించిన స్వరార్చన అలరించింది. ఆలయ కమిటీ చైర్మన్‌ చావలి గణపతి, ఉత్సవ కమిటీ కన్వీనర్‌ రాయపాటి సత్యనారాయణ భక్తులు పాల్గొన్నారు.

లలితాంబకు కుంకుమ పూజలు 1
1/3

లలితాంబకు కుంకుమ పూజలు

లలితాంబకు కుంకుమ పూజలు 2
2/3

లలితాంబకు కుంకుమ పూజలు

లలితాంబకు కుంకుమ పూజలు 3
3/3

లలితాంబకు కుంకుమ పూజలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement