చంద్రబాబువి నీచ రాజకీయాలు
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నీచ రాజకీయాలకు కేరాఫ్‌గా నిలుస్తున్నారు. గుంటూరులో మాజీ మంత్రి అంబటి రాంబాబుపై టీడీపీ రౌడీ మూకలు దాడికి యత్నించడమే కాకుండా ఆయన నివాసంపై దాడికి దిగడం దుర్మార్గం. దీనిని ఖండిస్తున్నాం. వెంకటేశ్వరస్వామి లడ్డూ ప్రసాదం విషయంలో చంద్రబాబు అండ్ కో దుష్ప్రచారం చేస్తోంది. సీబీఐ నివేదిక చూసైనా చంద్రబాబు బుద్ధి తెచ్చుకోవాలి. కోట్లాదిమంది భక్తుల మనోభావాలతో చెలగాటం ఆడటం మంచి పద్ధతి కాదు. లడ్డూలో జంతువుల కొవ్వు కలవలేదని చెప్పినప్పటికీ పదేపదే దుష్ప్రచారం చేయడం, ఎల్లో మీడియాతో ప్రచారం చేయించడం దారుణం సార్వత్రిక ఎన్నికల హామీలను అమలు చేయాలని ప్రజలు ఎక్కడ ప్రశ్నిస్తారోననే భయంతోనే చంద్రబాబు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు. అంబటి రాంబాబుపై టీడీపీ రౌడీ మూకలు ఎందుకు దాడికి యత్నించాయి? ఈ దాడి చేయడం చూస్తుంటే రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా విఫలమయ్యాయని తెలుస్తోంది. ప్రత్యర్థులపై బురదచల్లడం చంద్రబాబు మానుకొని ఇకనైనా వాస్తవాలు గ్రహించాలి. మాజీ మంత్రి అంబటి నివాసంపై దాడి ప్రభుత్వం చేసిన దాడిగా భావిస్తున్నాం.
– డాక్టర్ గజ్జల సుధీర్ భార్గవ్ రెడ్డి,
సత్తెనపల్లి నియోజకవర్గ వైఎస్సార్ సీపీ సమన్వయకర్త


