ఏ ఏ గ్రామాల నుంచి ఎంతమంది
వ్యవసాయ పనులు లేకపోవడంతో పశ్చిమగోదావరి, తూర్పుగోదావరి, కోనసీమ జిల్లాలలో పొగాకు బేరన్‌లలో పనులకు పెదకూరపాడు మండలం పాటిబండ్ల గ్రామం నుంచి కోపూరు రాజు, నీసు నాగయ్య, గేరా పెద్దోడు, కట్ట సౌరీలు, దారా లాజరు ముఠాల ద్వారా సుమారు 100 మంది పనులకు వలస వెళ్లారు. కాశిపాడు గ్రామం నుంచి 25 కుటుంబాలు, లగడపాడు గ్రామం నుంచి 60 మంది, పొడపాడు, కనిగండ్ల, 75 తాళ్లూరు, ఖమ్మంపాడు, బలుసుపాడు గ్రామాల నుంచి కూడా పలువురు వలస బాట పట్టారు. అమరావతి మండలం జూపూడి గ్రామంలోని 300 మందికి పైగా కూలీలు వలస వెళ్లారు. దొడ్లేరు, మునగోడు, పెద్దపాలెం పలు గ్రామాలు నుంచి పెద్ద సంఖ్యలో వ్యవసాయ కూలీలు పనులు కోసం తరలి వెళ్లారు.


