అందుబాటులో ఆధునిక వైద్యం
క్యాన్సర్‌ను నయం చేసే ఆధునిక వైద్య పద్ధతులు నేడు అందుబాటులో ఉన్నాయి. ఇమ్యూనోథెరపీ, టార్గెట్ థెరపీ ద్వారా రోగులు త్వరగా కోలుకుంటున్నారు. నెక్ట్స్ జెనరేషన్ సీక్వెన్సింగ్ టెస్ట్ ద్వారా వ్యాధిని చాలా త్వరగా గుర్తించవచ్చు. ఏ జీన్‌లో తేడా వల్ల సోకుతుందనే విషయం తెలుస్తుంది. ల్యాప్రోస్కోపిక్, రోబోటిక్ సర్జరీలు అందుబాటులో ఉన్నాయి. బీఆర్‌సీఏ–1, 2 పరీక్షల ద్వారా కుటుంబంలో ఒకరికి వ్యాధి ఉంటే ఇతరులకు వస్తుందా రాదా అని నిర్ధారించవచ్చు. హెల్త్ ఇన్సూరెన్సుల ద్వారా అనేక రకాల క్యాన్సర్‌లకు ఉచిత వైద్య సేవలు లభిస్తున్నాయి.
– డాక్టర్ ఎం.జి.నాగకిషోర్, సీనియర్ సర్జికల్ ఆంకాలజిస్ట్, గుంటూరు


