పోటాపోటీగా ఎడ్ల బలప్రదర్శన పోటీలు | - | Sakshi
Sakshi News home page

పోటాపోటీగా ఎడ్ల బలప్రదర్శన పోటీలు

Jan 30 2026 6:47 AM | Updated on Jan 30 2026 6:47 AM

పోటాప

పోటాపోటీగా ఎడ్ల బలప్రదర్శన పోటీలు

ఆరు పళ్ల విభాగంలో ప్రథమ స్థానంలో నిలిచిన పల్నాడు జిల్లా ఎడ్లు ద్వితీయస్థానం సాధించిన కృష్ణా జిల్లా గిత్తలు

రెంటచింతల: ఫిబ్రవరి 2వ తేదీన నిర్వహించనున్న స్థానిక కానుకమాత చర్చి 176 తిరునాళ్ల మహోత్సవాన్ని పురస్కరించుకుని గురువారం స్థానిక సెయింట్‌ జోసఫ్స్‌ ఉన్నత పాఠశాల క్రీడామైదానం లో నిర్వహిస్తున్న జాతీయ స్థాయి ఒంగోలు జాతి ఎడ్ల బలప్రదర్శన పోటీలు పోటీపోటీగా జరిగాయి. ఆరు పళ్ల సైజ్‌ విభాగంలో జరిగిన ఈ ప్రదర్శనలో పల్నాడు జిల్లా దాచేపల్లి మండలం కేసానుపల్లి గ్రామానికి చెందిన నెల్లూరు రామకోటయ్య గిత్తలు 4,532.8 అడుగుల దూరంలాగి ప్రథమ బహుమతి రూ.70 వేలను కై వసం చేసుకున్నాయి. కృష్ణా జిల్లా పెనమలూరు మండలం యనమలకుదురు గ్రామానికి చెందిన అనంతనేని శ్రీకావ్య, శ్రీ మధు ఎద్దులు 4,519.7 అడుగుల దూరంలాగి రెండవ బహుమతి రూ. 50 వేలను దక్కించుకున్నాయి. మార్కాపురం జిల్లా యర్రగొండపాలెంకు చెందిన ఒంగోలు మూర్తి రెడ్డి గిత్తలు 4,500 అడుగుల దూరంలాగి 3వ బహుమతి రూ. 40 వేలు గెలుచుకున్నాయి. మార్కాపురం జిల్లా యర్రగొండపాలెంకు చెందిన ఒంగోలు మూర్తి రెడ్డి ఎడ్లు 4,244.1 అడుగుల దూరంలాగి 4 వ బహుమతి రూ. 30 వేలు, కృష్ణా జిల్లా బాపులపాడు మండలం మల్లవల్లి గ్రామానికి చెందిన అక్కినేని శాన్వి చౌదరి, బాపట్ల జిల్లా మండల కేంద్రమైన వేటపాలెంకు చెందిన దేవరవల్లి జాన్వికారెడ్డి, అన్వితా రెడ్డిల కంబైన్డ్‌ గిత్తలు 3,999.10 అడుగుల దూరంలాగి 5వ బహుమతి రూ. 20 వేలను గెలుచుకున్నాయి. ఇలా తొమ్మిదోస్థానం వరకు ఎడ్లు బహుమతులు గెలుచుకున్నాయి. ఈ బలప్రదర్శనలో మొత్తం 14 జతలు పాల్గొనగా మిగిలిన 5 జతలకు కూడా రూ. 4 వేల చొప్పున ప్రోత్సాహక బహుమతులుగా అందచేసినట్లు కమిటీ సభ్యులు వైఎల్‌ మర్రెడ్డి, ఆదూరి ఇన్నారెడ్డి, ఏరువ జోజిరెడ్డి, గొంటు సుమంత్‌ రెడ్డి, బొడపాటి రామకృష్ణ, మూలి రాజారెడ్డి, ఎం. చిన్నశౌర్రెడ్డి, కె. జోసఫ్‌రెడ్డి, గాదె కస్పారెడ్డి, వెన్నా కోటిరెడ్డి, ఓ. ఇన్నారెడ్డి, జడ్డు రాజేష్‌రెడ్డి, వైఎఫ్‌ మర్రెడ్డి, మూలి రాయపురెడ్డి తెలిపారు. న్యాయనిర్ణేతలుగా సురపనేని రాధాకృష్ణ, పెద్దిరెడ్డి సుబ్బారెడ్డి, గూడ శ్రీనివాసరావులు వ్యవహరించారు.

పోటాపోటీగా ఎడ్ల బలప్రదర్శన పోటీలు 1
1/1

పోటాపోటీగా ఎడ్ల బలప్రదర్శన పోటీలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement