మహిమాన్వితురాలు కన్య మరియ తల్లి | - | Sakshi
Sakshi News home page

మహిమాన్వితురాలు కన్య మరియ తల్లి

Jan 26 2026 4:53 AM | Updated on Jan 26 2026 4:53 AM

మహిమా

మహిమాన్వితురాలు కన్య మరియ తల్లి

ఫాదర్‌ ఫాతిమా మర్రెడ్డి

రెంటచింతల: లోక రక్షకుడిగా ఏసుక్రీస్తుకు జన్మనిచ్చిన కన్య మరియతల్లి మహిమాన్వితురాలిగా ప్రపంచవ్యాప్తంగా కొనియాడబడుతుందని ఫిరంగిపురం విచారణ గురువులు రెవ.ఫాదర్‌ మాలపాటి ఫాతిమా మర్రెడ్డి అన్నారు. స్థానిక కానుకమాత చర్చి 176వ తిరుణాళ్ల వేడుకలను పురష్కరించుకుని నిర్వహిస్తున్న నవదిన ప్రార్థనలలో భాగంగా ఆదివారం ఆరోగ్యమాత మందిరం వద్ద విచారణ గురువులు ఏరువ లూర్ధు మర్రెడ్డి ఆధ్వర్యం లో నిర్వహించిన సమిష్టి దివ్యపూజాబలిని సహాయక గురువులు రెవ.ఫాదర్‌ ప్రసన్న కుమార్‌తో కలిసి సమర్పించి ఫాదర్‌ ఫాతిమా మర్రెడ్డి మాట్లాడారు. ఆధ్యాత్మికతతో ఏర్పడిన సమాజంలో ప్రజలందరూ శాంతియుతంగా సుఖ సంతోషాలతో జీవిస్తారన్నారు. ముందుగా జపమాలతో ప్రారంభించిన దివ్యపూజాబలిలో కన్యసీ్త్రలు, చర్చి పెద్దలు, భక్తులు పాల్గొన్నారు.

‘నీట్‌ ఎస్‌ఎస్‌’లో 1293 ర్యాంక్‌

రెంటచింతల: వైద్య విద్య సూపర్‌ స్పెషాలిటీ కోర్సుల్లో ప్రవేశానికై 2025 డిసెంబర్‌ 27న నిర్వహించిన నీట్‌ ఎస్‌ఎస్‌ పరీక్షలో మండల కేంద్రమైన రెంటచింతలకు చెందిన యువ వైద్యుడు తన్నీరు దుర్గాగణేష్‌ 1293వ ర్యాంక్‌ సాధించారు. కాకతీయ మెడికల్‌ కళాశాలలో ఎంబీబీఎస్‌, హైదరాబాద్‌లోని మెడిసిటీ హాస్పటల్‌లో ఎంఎస్‌ (జనరల్‌)ను గణేష్‌ పూర్తి చేశారు. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలోని ఆదిలాబాద్‌ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ వైద్యశాలలో విధులు నిర్వహిస్తున్నారు. న్యూరాలజిస్టు కోర్సులో చేరాలనే లక్ష్యంగా ఉన్నట్లు తెలిపారు. గణేష్‌ సతీమణి దీపిక కూడా ఆదిలాబాద్‌ గ్రామీణ పీహెచ్‌సీలో వైద్యురాలిగా పని చేస్తున్నారు.

మహిమాన్వితురాలు కన్య మరియ తల్లి 
1
1/1

మహిమాన్వితురాలు కన్య మరియ తల్లి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement