ఏపీ ఉపాధ్యాయ సంఘ ఆవిర్భావ దినోత్సవం | - | Sakshi
Sakshi News home page

ఏపీ ఉపాధ్యాయ సంఘ ఆవిర్భావ దినోత్సవం

Feb 3 2026 7:37 AM | Updated on Feb 3 2026 7:37 AM

ఏపీ ఉ

ఏపీ ఉపాధ్యాయ సంఘ ఆవిర్భావ దినోత్సవం

ఏపీ ఉపాధ్యాయ సంఘ ఆవిర్భావ దినోత్సవం మహంకాళీ అమ్మవారి హుండీ కానుకల లెక్కింపు కొండ గురునాథ స్వామికి హుండీ కానుకల ద్వారా ఆదాయం దుర్గమ్మకు గుంటూరు భక్తుని విరాళం సాగర్‌ నీటిమట్టం వివరాలు

గుంటూరు ఎడ్యుకేషన్‌: ఆంధ్రప్రదేశ్‌ ఉపాధ్యాయ సంఘ (ఏపీయూఎస్‌) ఆవిర్భావ దినోత్సవాన్ని సోమవారం గుంటూరు పట్టాభిపురం హైస్కూల్‌లో నిర్వహించారు. ఈ సందర్భంగా సంఘ రాష్ట్ర మహిళా కన్వీనర్‌ పమిడి పద్మ మాట్లాడుతూ 1982లో ఆవిర్భవించిన ఏపీయూఎస్‌ ఉపాధ్యాయుల సంక్షేమం కోసం విశేష కృషి చేస్తోందన్నారు. ఉపాధ్యాయుల హక్కుల పరిరక్షణ కోసం నిరంతరం పని చేస్తుందని అన్నారు. కార్యక్రమంలో సంఘ రాష్ట్ర ఆర్థిక కార్యదర్శి మన్నవ సురేష్‌, జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు శ్రీనివాసరావు, బాలచంద్రారెడ్డి, జిల్లా ఆర్థిక కార్యదర్శి ఎన్‌.శ్రీనివాసరావు, అదనపు కార్యదర్శి వైఆర్‌కే ప్రసాద్‌, జిల్లా కార్యనిర్వాహక అధ్యక్షడు వీరబాబు పాల్గొన్నారు.

దుగ్గిరాల: దుగ్గిరాల మండలం కంఠంరాజుకొండూరు గ్రామంలో వేంచేసి ఉన్న మహంకాళీ అమ్మవారి దేవస్థానంలో సోమవారం హుండీ కానులు లెక్కించారు. రూ.18, 83,646 ఆదాయం వచ్చినట్లు ఓ ప్రకటనలో తెలిపారు. దేవదాయ శాఖ ఇన్‌స్పెక్టరు సి.హెచ్‌. వెంకట శ్రీనివాసులు, దేవాలయ ధర్మకర్త డి.రంగప్రసాద్‌, దేవస్థాన సిబ్బంది, అర్చక స్వాములు, స్వచ్ఛంద సేవా సంస్థలు, భక్తుల సమక్షంలో లెక్కింపు కార్యక్రమం నిర్వహించామని ఆలయ కార్యనిర్వాహణ అధికారి కె.సునీల్‌ కుమార్‌ తెలిపారు.

నూజండ్ల: కొండ గురునాథస్వామి తిరునాళ్ళ అత్యంత వైభవంగా సాగింది. లక్ష మంది పైగా భక్తులు స్వామి వారిని దర్శించుకున్నారని అంచనా. ఈ మేరకు సోమవారం దేవదాయశాఖ, ధర్మకర్త, కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో హుండీ ద్వారా వచ్చిన విరాళాలు, కొబ్బరికాయ వేలం ద్వారా వచ్చిన రాబడిని లెక్కించారు. హుండీ ద్వారా 5 లక్షల 64 వేల రూపాయలు, కొబ్బరి చిప్పలు తలనీలాల వేలంపాట ద్వారా 2 లక్షల 50 వేల రూపాయలు ఆదాయం లభించినట్లు దేవదాయశాఖ అధికారులు తెలిపారు. కార్యక్రమంలో ఎండోమెంట్‌ ఇన్‌స్పెక్టర్‌ మంజూష, ఈవో శివనాగిరెడ్డి, సుధాకర్‌రెడ్డి, నెమలిరెడ్డి, లక్ష్మయ్య, సుబ్బారెడ్డి, ఎ.వెంకటేశ్వరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మకు పలువురు భక్తులు సోమవారం విరాళాలు అందజేశారు. గుంటూరు జిల్లా స్తంభాలగరువుకు చెందిన బండ్రెడ్డి దుర్గా పవన్‌ కుటుంబం అమ్మవారి ఉచిత ప్రసాద వితరణకు రూ.1,00,001 విరాళాన్ని ఆలయ ఏఈవో వెంకటరెడ్డికి అందజేశారు. దాతలకు ఆలయ మర్యాదలతో అమ్మవారి దర్శనం కల్పించారు. వేద పండితుల ఆశీర్వచనం అనంతరం దాతలకు ఆలయ అధికారులు అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలు, శేషవస్త్రాలను అందించారు.

విజయపురిసౌత్‌: నాగార్జున సాగర్‌ జలాశయ నీటిమట్టం సోమవారం 542.80 అడుగులకు చేరింది. జలాశయం నుంచి కుడి కాలువకు 8,023, ఎడమ కాలువకు 7,852, ఎస్‌ఎల్‌బీసీకి 2,200, వరద కాలువకు 300 క్యూసెక్కులు విడుదలవుతోంది. శ్రీశైలం నుంచి 18,375 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోంది.

ఏపీ ఉపాధ్యాయ సంఘ ఆవిర్భావ దినోత్సవం  1
1/1

ఏపీ ఉపాధ్యాయ సంఘ ఆవిర్భావ దినోత్సవం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement