ప్రశాంతంగా ప్రారంభమైన ఒకేషనల్ ప్రాక్టికల్స్
తొలిరోజు 186 మంది గైర్హాజరు
నరసరావుపేట ఈస్ట్: ఇంటర్మీడియెట్ ఒకేషనల్ ప్రాక్టికల్ పరీక్షలు బుధవారం ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. జిల్లా వ్యాప్తంగా 16 పరీక్ష కేంద్రాలలో 1,334 మంది విద్యార్థులకుగాను 1,148 మంది హాజరు కాగా మరో 186 మంది గైర్హాజరయ్యారు. వీరిలో ప్రథమ సంవత్సరం 734 మందికి గాను 606 మంది హాజరు కాగా 128 మంది గైర్హాజరయ్యారు. ద్వితీయ సంవత్సరం 600 మందికి గాను 542 మంది విద్యార్థులు హాజరు కాగా, మరో 58 మంది గైర్హాజరయ్యారు. సతైనపల్లిలోని వేద ఒకేషనల్ జూనియర్ కళాశాల, డాక్టర్ సీఎస్‌జీఎల్‌ఎం కళాశాల పరీక్ష కేంద్రాలను రాష్ట్ర పరిశీలకురాలు సౌజన్య సందర్శించి పరీక్ష నిర్వహణ తీరును పరిశీలించారు. ఇంటర్మీడియెట్ విద్యాశాఖాధికారి ఎం.నీలావతిదేవి మాచర్లలోని పరీక్ష కేంద్రాలను సందర్శించి పకడ్భందీగా నిర్వహించేందుకు పలు సూచనలు చేశారు.


