జిల్లా సమగ్రాభివృద్ధే లక్ష్యం
న్యూస్‌రీల్
జిల్లా ఎస్పీ బి.కృష్ణారావు, జేసీ సంజన సింహ, ఎమ్మెల్యే హాజరు గాలిలోకి బెలూన్ల ఎగురవేత సమరయోధుల వారసులకు సన్మానం డీఆర్‌డీఏ, ఉద్యాన, పంచాయతీ రాజ్ శకటాలకు బహుమతులు ప్రకృతి వ్యవసాయం, పశుసంవర్ధక శాఖ, అగ్నిమాపక శాఖల స్టాళ్లకు బహుమానాలు ఆకట్టుకున్న పోలీసు జాగిలాల ప్రదర్శన
పల్నాడు
మంగళవారం శ్రీ 27 శ్రీ జనవరి శ్రీ 2026
ప్రశంసాపత్రాల ప్రదానం
గణతంత్ర దిన వేడుకల్లో జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా
విజయపురి సౌత్: నాగార్జున సాగర్ జలాశయ నీటిమట్టం సోమవారం 547.30 అడుగులకు చేరింది. కుడి కాలువకు 10,000, ఎడమ కాలువకు 7,601 క్యూసెక్కులు వదిలారు.
సాక్షి, నరసరావుపేట: జిల్లా సమగ్రాభివృద్ధే ధ్యేయంగా పనిచేస్తున్నట్లు గణతంత్ర దిన వేడుకల్లో జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా తెలిపారు. స్వాతంత్య్రం కోసం ఎన్నో త్యాగాలు చేసిన మహనీయులకు జోహార్లు... పెద్దల స్ఫూర్తితో జిల్లాలో వివిధ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను సమర్థంగా నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. సోమవారం నరసరావుపేట రూరల్ మండలం లింగంగుంట్లలోని జిల్లా కలెక్టరేట్ వద్ద పోలీస్ పరేడ్ గ్రౌండ్‌లో జరిగిన గణతంత్ర దిన వేడుకల్లో ముఖ్యఅతిథిగా ప్రసంగించారు. ఉదయం 9 గంటలకు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. జిల్లా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. స్వాతంత్య్రం సిద్ధించటానికి కృషి చేసిన సమరయోధుల సేవలను కొనియాడారు. అమరవీరులకు నివాళులు అర్పించారు. రాజ్యాంగం గొప్పతనాన్ని గుర్తుచేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... వ్యవసాయ రంగానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందన్నారు. విద్య, వైద్యానికి ప్రాధాన్యత ఇస్తున్నామని చెప్పారు. డిసెంబర్ నుంచి రెవెన్యూ క్లినిక్‌లు ప్రతి సోమవారం నిర్వస్తున్నట్లు వివరించారు. అమరావతి రాజధాని నిర్మాణం కోసం ల్యాండ్ పూలింగ్ ద్వారా 9 వేల ఎకరాలు సేకరించున్నామని కలెక్టర్ తెలిపారు. రాజుపాలెం నుంచి అమరావతి వరకు 45 కిలోమీటర్లు మేర రెండు లైన్ల రహదారి అభివృద్ధి పరిచేందుకు రూ.143 కోట్ల నాబార్డు నిధులతో పనులు జరుగుతున్నాయని పేర్కొన్నారు. త్వరలోనే భూసేకరణ పూర్తి చేసి నకరికల్లు–వాడరేవు జాతీయ రహదారి 167ఏ నిర్మాణం చేపట్టనున్నామన్నారు. జిల్లాలో ప్రధాన మంత్రి నగరవనం స్కీం ద్వారా కోటప్పకొండ, వినుకొండ, మాచర్ల, దేవరంపాడు అటవీ ప్రాంతంలో యోగశాల, పిల్లల పార్కులు ఏర్పాటు చేశామన్నారు.
సమరయోధుల వారసులకు సన్మానం
నరసరావుపేట: స్థానిక కలెక్టరేట్ పరేడ్ గ్రౌండ్ వేదికగా సోమవారం గణతంత్ర దినోత్సవాలు అట్టహాసంగా జరిగాయి. తొలుత జిల్లా డాక్టర్ కలెక్టర్ కృతికా శుక్లా జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. జిల్లా ఎస్పీ బి.కృష్ణారావు, జాయింట్ కలెక్టర్ సంజన సింహతో కలిసి పోలీసు, ఎన్‌సీసీ దళాల గౌరవ వందనం స్వీకరించారు. తొలుత వారు ఆహ్వానితులకు అభివాదం తెలిపారు. ప్రత్యేక వాహనంలో పరేడ్‌గ్రౌండ్ కలయ తిరిగారు. జిల్లా నుంచి స్వాతంత్య్ర పోరాటంలో పాల్గొన్న పుల్లరి హనుమంతును స్మరించుకున్నారు. ప్రత్యేకంగా ఆహ్వానించిన స్వాతంత్య్ర సమరయోధుల కుటుంబ సభ్యులు సయ్యద్ జీనత్ బేగం, ఎం.వీరమ్మ (వీరమాత), పి.సావిత్రిరెడ్డి, డి.రామకృష్ణారెడ్డిలను కలెక్టర్ సన్మానించారు. వ్యవసాయ అనుబంధ శాఖలు, డ్వామా, ఏపీఎస్‌ఆర్టీసీ, గ్రామీణాభివృద్ధి, విద్య, పంచాయతీరాజ్, పౌరసరఫరాలు, మహిళాభివృద్ధి–శిశు సంక్షేమం, గృహనిర్మాణ సంస్థ, వైద్యారోగ్యం, సాంఘిక సంక్షేమం, అటవీ శాఖల శకటాల ప్రదర్శనను ఆసక్తిగా తిలకించారు. డీఆర్డీఏ, ఉద్యాన, పంచాయతీరాజ్ –గ్రామీణాభివృద్ధి శాఖల శకటాలు తొలి మూడు స్థానాలు పొందాయి. దేశభక్తి గీతాలకు పాఠశాలల విద్యార్థులు నృత్యాలు చేశారు.
7
ఉత్తమ సాంస్కృతిక ప్రదర్శనలు, శకటాలు, స్టాళ్లు, విధి నిర్వహణలో ప్రతిభ కనబర్చిన 203 ఉద్యోగులు, ఎన్‌జీఓ సభ్యులకు ప్రశంసా పత్రాలు అందజేశారు. చివరిగా వివిధ శాఖలు ఏర్పాటు చేసిన స్టాళ్లను పరిశీలించారు. ఐసీడీఎస్, గ్రామీణ నీటి సరఫరా, ఎల్డీఎం, ప్రకృతి వ్యవసాయం, అటవీ శాఖ, రహదారి భద్రత, అగ్నిమాపకం, మత్స్య, విద్యుత్, పశు సంవర్థక శాఖలు స్టాళ్లు ఏర్పాటు చేశాయి. ప్రకృతి వ్యవసాయం, పశు సంవర్ధక శాఖ, అగ్నిమాపక శాఖల స్టాళ్లు తొలి మూడు బహుమతులు దక్కించుకున్నాయి. సాంస్కృతిక కార్యక్రమాలకు సంబంధించి నరసరావుపేట గిరిజన సంక్షేమ బాలిక వసతి గృహం, వినుకొండ గీతాంజలి ఉన్నత పాఠశాల విద్యార్థులు సంయుక్తంగా ప్రథమ బహుమతి పొందారు. స్థానిక సెయింట్ జోసెఫ్ హైస్కూల్, శంకర భారతీపురం జెడ్పీ ఉన్నత పాఠశాల సంయుక్తంగా ద్వితీయ బహుమతి, స్థానిక మున్సిపల్ బాలికల ఉన్నత పాఠశాల, కేజీబీవీలు సంయుక్తంగా తృతీయ బహుమతులు పొందాయి. జాతీయ గీతంతో వేడుకలకు ముగింపు పలికారు.
జిల్లా సమగ్రాభివృద్ధే లక్ష్యం
జిల్లా సమగ్రాభివృద్ధే లక్ష్యం
జిల్లా సమగ్రాభివృద్ధే లక్ష్యం
జిల్లా సమగ్రాభివృద్ధే లక్ష్యం
జిల్లా సమగ్రాభివృద్ధే లక్ష్యం
జిల్లా సమగ్రాభివృద్ధే లక్ష్యం
జిల్లా సమగ్రాభివృద్ధే లక్ష్యం
జిల్లా సమగ్రాభివృద్ధే లక్ష్యం


