పీఆర్‌టీయూ(డెమోక్రటిక్‌) జిల్లా అధ్యక్షుడిగా జ్ఞానేశ్వరరావు | - | Sakshi
Sakshi News home page

పీఆర్‌టీయూ(డెమోక్రటిక్‌) జిల్లా అధ్యక్షుడిగా జ్ఞానేశ్వరరావు

Jan 29 2026 6:19 AM | Updated on Jan 29 2026 6:19 AM

పీఆర్

పీఆర్‌టీయూ(డెమోక్రటిక్‌) జిల్లా అధ్యక్షుడిగా జ్ఞానేశ్వర

సత్తెనపల్లి: డెమోక్రటిక్‌ పీఆర్‌టీయూ పల్నాడు జిల్లా అధ్యక్షుడిగా జువ్వా జ్ఞానేశ్వరరావు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. స్థానిక అంజీ మెమోరియల్‌ ఇంగ్లిష్‌ మీడియం పాఠశాలలో జిల్లా కార్యవర్గ సమావేశం బుధవారం నిర్వహించారు. సమావేశానికి రాష్ట్ర శాఖ అధ్యక్షుడు డాక్టర్‌ డి.శ్రీను అధ్యక్షత వహించారు. గౌరవ అధ్యక్షుడిగా నర్రా సుధాకరరావు, ప్రధాన కార్యదర్శిగా చొప్పర కమలాకరరావు, ఆర్థిక కార్యదర్శిగా దేవిరెడ్డి వెంకటేశ్వర్లు, జిల్లా ఉపాధ్యక్షులు బుల్లా రామారావు, జిల్లా కార్యదర్శిగా యు.సుబ్బారావులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. రాష్ట్ర అసోసియేట్‌ అధ్యక్షుడిగా వి.మురళీకృష్ణ, రాష్ట్ర కార్యదర్శిగా బంకా వాసుబాబు, రాష్ట్ర ఉపాధ్యక్షులుగా బెల్లంకొండ నాగసాయి ప్రసాద్‌, లాకు పిచ్చయ్య ఎంపికయ్యారు. జిల్లా శాఖ మహిళా కార్యదర్శులుగా ఎస్‌.నాగమణి, కె.శ్రీలక్ష్మి ఎన్నికయ్యారు.

ఎయిడెడ్‌ పాఠశాలల్లో హిందీ పండిట్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తుల స్వీకరణ

గుంటూరు ఎడ్యుకేషన్‌: గుంటూరు నగరంలోని రెండు ఎయిడెడ్‌ పాఠశాలల్లో రెండు గ్రేడ్‌–2 హిందీ పండిట్‌ పోస్టులను కాంట్రాక్ట్‌ పద్దతిపై భర్తీ చేసేందుకు అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు జిల్లా విద్యాశాఖాధికారి షేక్‌ సలీమ్‌ బాషా బుధవారం ఓప్రకటనలో తెలిపారు. అరండల్‌పేట 10వ లైనులోని రెసిడెన్షియల్‌ ఆదివాసీ ప్రాథమికోన్నత పాఠశాల, శ్రీనివాసరావుపేటలోని శ్రీరవీంద్రనాద్‌ ఠాగూర్‌ కమిటీ ప్రాథమికోన్నత పాఠశాలల్లో కాంట్రాక్టు పద్దతిపై మూడేళ్లు పని చేసేందుకు హిందీ పండిట్‌ శిక్షణతో పాటు టెట్‌లో ఉత్తీర్ణులైన అభ్యర్థులు ఫిబ్రవరి 4వ తేదీలోపు సంబంధిత పాఠశాలల కరస్పాండెంట్లకు వ్యక్తిగతంగా, లేదా సీఎస్‌ఈ.ఏపీ.ఇన్‌/ఎయిడెడ్‌రిక్రూట్‌మెంట్‌ నోటిఫికేషన్‌ ద్వారా దరఖాస్తు చేయాలని సూచించారు. దరఖాస్తుదారులకు జీవోఎంఎస్‌ 58 ప్రకారం ఏకీకృత జాబితాను డీఈఓ పోర్టల్‌లో ప్రచురించి, నియామక పరీక్ష పారదర్శకంగా నిర్వహిస్తామని తెలిపారు.

ముగిసిన వార్షిక బ్రహ్మోత్సవాలు

తాడేపల్లి రూరల్‌: తాడేపల్లి పట్టణం సీతానగరం విజయకీలాద్రి దివ్యక్షేత్ర 9వ వార్షిక బ్రహ్మోత్సవాలు బుధవారంతో ఘనంగా ముగిశాయి. త్రిదండి చిన శ్రీమన్నారాయణ రామానుజ జీయర్‌స్వామి ప్రత్యక్ష పర్యవేక్షణలో ఉదయం 11 గంటల నుంచి అవబృధ స్నానం, చక్రతీర్థం కార్యక్రమాలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. సాయంత్రం 6.30 గంటలకు శ్రీ పుష్పయాగం, ద్వాదశారాధన, దేవతోద్వాసన, మహాపూర్ణాహుతి, ధ్వజారోహణం, సప్తవరణ, ఋత్విక్‌ సమ్మానం, వేదాశీర్వాచనంతో వార్షిక బ్రహ్మోత్సవాలు ముగిశాయి.

పీఆర్‌టీయూ(డెమోక్రటిక్‌) జిల్లా అధ్యక్షుడిగా జ్ఞానేశ్వర1
1/1

పీఆర్‌టీయూ(డెమోక్రటిక్‌) జిల్లా అధ్యక్షుడిగా జ్ఞానేశ్వర

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement