ఉద్యోగ విరమణ పొందిన పోలీసు సిబ్బందికి సత్కారం | - | Sakshi
Sakshi News home page

ఉద్యోగ విరమణ పొందిన పోలీసు సిబ్బందికి సత్కారం

Feb 1 2026 3:29 AM | Updated on Feb 1 2026 3:29 AM

ఉద్యో

ఉద్యోగ విరమణ పొందిన పోలీసు సిబ్బందికి సత్కారం

ఉద్యోగ విరమణ పొందిన పోలీసు సిబ్బందికి సత్కారం నరసరావుపేట రూరల్‌: పోలీసు శాఖలో సుదీర్ఘ కాలం సేవలు అందించి ఉద్యోగ విరమణ పొందిన సిబ్బందిని జిల్లా ఎస్పీ బి.కృష్ణారావు శనివారం సత్కరించారు. జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో ఉద్యోగ విరమణ పొందిన ఏఎస్‌ఐ పి.సుబ్బారావు, హోంగార్డు డి.సామ్రాజ్యంలను ఎస్పీ సత్కరించారు. ఎస్పీ మాట్లాడుతూ సమాజంలో శాంతిభద్రతల పరిరక్షణ కోసం సుదీర్ఘకాలం సేవలు అందించిన వారిని అభినందించారు. పోలీసు శాఖకు మీరు అందించిన సేవలు భావితరాలకు ఆదర్శంగా నిలుస్తాయని పేర్కొన్నారు. తమ విధులను సమర్ధంగా నిర్వర్తించడంలో కుటుంబ సభ్యుల పాత్ర ముఖ్యమని తెలిపారు. ఉద్యోగ విరమణ పొందిన సిబ్బంది శేషజీవితం సుఖసంతోషాలతో గడపాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో జిల్లా అదనపు ఎస్పీ(అడ్మిన్‌) జేవీ సంతోష్‌, అదనపు ఎస్పీ(ఏఆర్‌) వి.సత్తిరాజు, ఏఆర్‌ డీఎస్పీ మహాత్మాగాంధీరెడ్డి, సత్తెనపల్లి పట్టణ సీఐ నాగమల్లేశ్వరరావు, వెల్పేర్‌ ఆర్‌ఐ ఎల్‌.గోపీనాధ్‌ తదితరులు పాల్గొన్నారు. రైలు కింద పడి వ్యక్తి ఆత్మహత్య చిరస్మరణీయుడు రంగస్థల నట దర్శకుడు శివరామరెడ్డి

నరసరావుపేట టౌన్‌: రైలు కిందపడి వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన శనివారం పట్టణంలో చోటుచేసుకుంది. రైల్వే పోలీసుల వివరాలు ప్రకారం.. ప్రకాష్‌నగర్‌కు చెందిన డి.మల్లికార్జునరావు(35) మార్కెట్‌ సెంటర్‌ సమీపంలో రైలుపట్టాలపై ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సమాచారం అందుకున్న రైల్వే ఎస్‌ఐ రాజమోహనరావు సంఘటన స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఏరియా వైద్యశాలకు తరలించారు. కుటుంబ సమస్యల నేపథ్యంలో ఆత్మహత్యకు పాల్పడి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. ఈమెరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.

15వ వర్థంతి సభలో వక్తల నివాళి

నూతక్కి(తెనాలి): ప్రముఖ రంగస్థల దర్శకుడు, నటుడు అన్నపురెడ్డి శివరామరెడ్డి 15వ వర్ధంతి సభను శనివారం మంగళగిరి మండలం నూతక్కిలో ప్రజానాట్యమండలి ఆధ్వర్యంలో నిర్వహించారు. శివరామరెడ్డి నటనను, దర్శక ప్రతిభను కొనియాడుతూ వక్తలు నివాళులర్పించారు. నటుడు జొన్నల పేరిరెడ్డిని సన్మానించారు. కార్యక్రమంలో భీమిరెడ్డి సుబ్బారెడ్డి, కూర్మారెడ్డి, వల్లూరి శివప్రసాద్‌, ప్రజానాట్యమండలి గాయకుడు జగన్‌ తదితరులు మాట్లాడారు.

ఉద్యోగ విరమణ పొందిన పోలీసు సిబ్బందికి సత్కారం 
1
1/1

ఉద్యోగ విరమణ పొందిన పోలీసు సిబ్బందికి సత్కారం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement