హోరాహోరీగా ఎడ్ల బలప్రదర్శన పోటీలు
రెంటచింతల: స్థానిక సెయింట్ జోసఫ్స్ ఉన్నత పాఠశాల క్రీడామైదానంలో నిర్వహిస్తున్న జాతీయ స్థాయి ఒంగోలు జాతి ఎడ్ల బలప్రదర్శన పోటీలు హోరాహోరీగా జరిగాయి. ఫిబ్రవరి 2వ తేదీన నిర్వహించనున్న స్థానిక కానుకమాత చర్చి 176 తిరునాళ్ల మహోత్సవాన్ని పురస్కరించుకుని బల ప్రదర్శన పోటీలు నిర్వహిస్తున్నారు. నాలుగు పళ్ల సైజ్ విభాగంలో బుధవారం జరిగిన ఈ ప్రదర్శనలో తెలంగాణ రాష్ట్రం సూర్యపేట జిల్లా మేళ్లచెరువు మండల కేంద్రానికి చెందిన కొప్పుల గోవర్ధన్‌రెడ్డి, ప్రవలీష్‌రెడ్డిల గిత్తలు 4,391.6 అడుగుల దూరం లాగి ప్రథమ బహుమతి రూ. 60 వేలను కై వసం చేసుకున్నాయి. ఏలూరు జిల్లా నూజివీడు మండల కేంద్రానికి చెందిన రాష్ట్ర మంత్రి కొలుసు పార్ధసారధి, ప్రకాశం జిల్లా కురిచేడు మండలం పోట్లపాడు గ్రామానికి చెందిన కంబైన్డ్ ఎడ్లు 4,379.3 అడుగుల దూరం లాగి రెండవ బహుమతి రూ. 40 వేలను దక్కించుకున్నాయి. ప్రకాశం జిల్లా కంభం మండలం ఎర్రబాలెం గ్రామా నికి చెందిన వెంకటగిరి హేమలతనాయుడు గిత్తలు 4,208.9 అడుగుల దూరం లాగి 3 వ బహుమతి రూ. 35 వేలను, పల్నాడు జిల్లా దాచేపల్లి మండలం కేసానుపల్లి గ్రామానికి చెందిన గిత్తలు 4,066 అడుగుల దూరంలాగి 4 వ బహుమతి రూ.25 వేలను, వైఎస్సార్ కడప జిల్లా పెద్దముడియం మండలం పాలూరు గ్రామానికి చెందిన కె. వెంకట హేమలతారెడ్డి గిత్తలు 3,964 అడుగుల దూరం లాగి 5 వ బహుమతి రూ. 18 వేలను గెలుచుకున్నాయి. ఇలా 9వ స్థానం వరకు నగదు బహుమతులు గెలుచుకున్నాయి. బలప్రదర్శనలో మొత్తం 12 జతలు పాల్గొనగా మిగిలిన 3 జతలకు కూడా రూ. 4 వేల చొప్పున ప్రోత్సహక బహుమతులు అందచేసినట్లు కమిటీ సభ్యులు వైఎల్ మర్రెడ్డి, ఆదూరి ఇన్నారెడ్డి, ఏరువ జోజిరెడ్డి, గొంటు సుమంత్ రెడ్డి, బొడపాటి రామకృష్ణ, మూలి రాజారెడ్డి, ఎం.చిన్న శౌర్రెడ్డి, కె. జోసఫ్‌రెడ్డి, గాదె కస్పారెడ్డి, వెన్నా కోటిరెడ్డి, ఓ. ఇన్నారెడ్డి, జడ్డు రాజేష్‌రెడ్డి, వైఎఫ్ మర్రెడ్డి, మూలి రాయపురెడ్డి తెలిపారు. న్యాయనిర్ణేతలు రాధాకృష్ణ, పి.సుబ్బారెడ్డి, శ్రీనివాసరావు తెలిపారు.
ప్రథమస్థానం సాధించిన ఎడ్ల యజమానులకు నగదు బహుమతి అందజేస్తున్న దృశ్యం
ప్రథమ బహుమతి కై వసం చేసుకున్న మేళ్లచెరువు ఎడ్ల జత
నాలుగు పళ్ల విభాగంలో
మేళ్లచెరువు ఎడ్లకు ప్రథమస్థానం
హోరాహోరీగా ఎడ్ల బలప్రదర్శన పోటీలు


