నేటి నుంచి జాతీయస్థాయి ఎద్దుల బల ప్రదర్శన | - | Sakshi
Sakshi News home page

నేటి నుంచి జాతీయస్థాయి ఎద్దుల బల ప్రదర్శన

Jan 26 2026 4:53 AM | Updated on Jan 26 2026 4:53 AM

నేటి నుంచి జాతీయస్థాయి ఎద్దుల బల ప్రదర్శన

నేటి నుంచి జాతీయస్థాయి ఎద్దుల బల ప్రదర్శన

రెంటచింతల: స్థానిక కానుకమాత చర్చి 176వ తిరునాళ్ల మహోత్సవాన్ని పురస్కరించుకుని సోమవారం నుంచి జాతీయ స్థాయి ఒంగోలు జాతి ఎద్దుల బలప్రదర్శన నిర్వహించనున్నారు. ఈ మేరకు సర్వం సిద్ధమైనట్లు కమిటీ సభ్యులు తెలిపారు. ఆదివారం స్థానిక సెయింట్‌ జోసఫ్స్‌ ఉన్నత పాఠశాల క్రీడామైదానంలో కార్యక్రమం కోసం ఏర్పాటు చేసిన గరడిలో పోస్టర్లను విడుదల చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ... అవసరమైన ఏర్పాట్లు చేశామని తెలిపారు. ప్రతి విభాగంలో 9 బహుమతుల చొప్పున 72 మంది విజేతలకు మొత్తం రూ. 26 లక్షల నగదుతోపాటు మరో రూ.2 లక్షల ప్రోత్సాహక బహుమతులు అందచేయనున్నట్లు తెలిపారు.

బహుమతులు ఇలా..

26వ తేదీన తొలి ముగ్గురు విజేతలకు టచ్‌ పళ్ల విభాగంలో రూ. 40 వేలు, రూ. 30 వేలు, రూ. 25 వేలు చొప్పున అందిస్తామన్నారు. 27న రెండు పళ్ల విభాగంలో రూ. 50 వేలు, రూ. 35 వేలు, రూ. 30 వేలు... 28న నాలుగు పళ్ల విభాగంలో రూ. 60 వేలు, రూ. 40 వేలు, రూ. 35 వేలు... 29న ఆరు పళ్ల విభాగంలో రూ. 70 వేలు, రూ. 50 వేలు, రూ. 40 వేలు... 30న న్యూ కేటగిరీలో రూ. 80 వేలు, రూ. 60 వేలు, రూ. 45 వేలు... 31న సబ్‌ జూనియర్‌ విభాగంలో రూ. 90 వేలు, రూ.70 వేలు, రూ. 50 వేలు.. ఫిబ్రవరి ఒకటో తేదీన జూనియర్స్‌ విభాగంలో రూ. లక్ష, రూ. 80 వేలు, రూ. 60 వేలు చొప్పున తొలి ముగ్గురు విజేతలకు అందజేస్తామని వెల్లడించారు. ఫిబ్రవరి 3న సీనియర్స్‌ విభాగంలో మొదటి బహుమతిగా బుల్లెట్‌ బైకు, రెండో బహుమతిగా యూనికాన్‌ బైక్‌, మూడో బహుమతిగా రూ. 90 వేలు, నాగులో బహుమతిగా రూ.70 వేలు, ఐదో బహుమతిగా రూ. 50 వేలు ఆయా గిత్తల యజమానులకు అందిస్తామని పేర్కొన్నారు. ఈ సమావేశంలో నిర్వాహకులు వైఎల్‌ మర్రెడ్డి, జి.సుమంత్‌రెడ్డి, ఎ.ఇన్నారెడ్డి, బి.రామకృష్ణ, జి.కస్పాల్‌రెడ్డి, వై.జోజిరెడ్డి, వెన్నా కోటిరెడ్డి, కె.జోసఫ్‌రెడ్డి, ఎం.రాజారెడ్డి, ఎం.చిన్న శౌర్రెడ్డి, జి.రంజిత్‌కుమార్‌ రెడ్డి, వైఎఫ్‌ మర్రెడ్డి, పి.రాజారెడ్డి, జి.రాజేష్‌రెడ్డి తదితరులున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement